ఓ సీరియ‌ల్ స్టార్‌ మ‌రో సీరియ‌ల్‌లోకి గెస్ట్‌గా స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చి అప్పుడ‌ప్పుడు ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తుంటారు. త‌మ ఫేవ‌రేట్ స్టార్‌ మ‌రో సీరియ‌ల్ క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి అంతు ఉండ‌దు. 'చిన్ని' సీరియ‌ల్‌లో అలాంటి సీన్ క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సీరియ‌ల్‌లో 'బ్ర‌హ్మ‌ముడి' కావ్య (Brahmamudi Kavya) గెస్ట్ రోల్ చేస్తోంది. అదేనండీ దీపికా రంగరాజు. 

'చిన్ని'లో అమ్మవారిగా 'బ్రహ్మముడి' కావ్య'చిన్ని' సీరియల్ మేకర్స్ కావ్య రోల్ ఏమిట‌న్న‌ది ఇంకా రివీల్ చేయ‌లేదు. అమ్మ‌వారిగా ఆమె క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 'చిన్ని'లోకి కావ్య ఎంట్రీ ఇవ్వ‌నుండ‌టంతో సీరియ‌ల్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కావ్య రోల్ ఒక ఎపిసోడ్‌తోనే ముగించ‌కుండా నాలుగైదు ఎపిసోడ్స్ వ‌ర‌కు కంటిన్యూ చేస్తే బాగుంటుంద‌ని అభిమానులు అంటున్నారు. 

'చిన్ని'లో సెకండ్ జ‌న‌రేష‌న్‌... మెయిన్ ఎవరంటే?'చిన్ని' సీరియ‌ల్ ఇటీవ‌లే సెకండ్ జ‌న‌రేష‌న్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 'చిన్ని' ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్‌లో కావ్య‌ శ్రీ, 'బిగ్ బాస్' విన్నర్ నిఖిల్‌ మలయక్కల్, వీరేన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. వారి క్యారెక్ట‌ర్స్‌ ఎండ్ చేస్తూ కొత్త క‌థ‌తో సెకండ్ జ‌న‌రేష‌న్‌ మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. ఈ సెకండ్ జ‌న‌రేష‌న్‌లో కావ్య‌ భ‌గ‌వ‌త్‌, సుజీత్ కుమార్‌, రోష‌న్‌, సాయి చేత‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాగ‌వ‌ల్లి పాత్ర నుంచి న‌య‌న త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలో ర‌జిని సీరియ‌ల్‌లోకి అడుగుపెట్టింది. 

కావ్య శ్రీ, నిఖిల్ వెళ్లడంతో టీఆర్ఫీలో డౌన్‌ ఫాల్ స్టార్ట్‌!కావ్య‌ శ్రీ, నిఖిల్ మలయక్కల్ వంటి స్టార్స్ ఉండ‌టం వ‌ల్ల టీఆర్‌పీలో చిన్ని ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ అద‌ర‌గొట్టింది. కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు లాంటి సీరియ‌ల్స్‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ టాప్‌లో కొన‌సాగింది. స‌డెన్‌గా కావ్య‌శ్రీ, నిఖిల్ క్యారెక్ట‌ర్స్‌ను ఎండ్ చేయ‌డంలో చిన్న డౌన్‌ఫాల్ మొద‌లైంది. సెకండ్ జ‌న‌రేష‌న్‌లో తెలుగు ఆడియెన్స్‌కు తెలిసిన యాక్ట‌ర్స్ లేక‌పోవ‌డం కూడా మైన‌స్ అవుతోంది. ఒక‌ప్పుడు టీఆర్‌పీలో టాప్ 2లో ఉన్న చిన్ని సీరియ‌ల్ ఇప్పుడు ఐదో స్థానానికి ప‌డిపోయింది. 

Also Read: ఎవరీ పల్లవి రామిశెట్టి? సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న 'ఇంటింటి రామాయ‌ణం' అవ‌ని - మైథ‌లాజిక‌ల్ మూవీలో సుభ‌ద్ర‌గా

'బ్రహ్మముడి'తో తెలుగింటికి చేరిన దీపికా రంగ‌రాజుమ‌రోవైపు 'బ్ర‌హ్మ‌ముడి' సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది కావ్య‌. ఆమె అస‌లు పేరు దీపికా రంగ‌రాజు అయినా కావ్య‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. ఎన్ని క‌ష్టాలు ఎదురైన త‌ట్టుకొని నిల‌బ‌డే స‌గ‌టు ఇల్లాలిగా, అత్తింటి గౌర‌వం కాపాడ‌టం కోసం ఆరాట‌ప‌డే కోడ‌లిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఈ సీరియ‌ల్‌లో అద‌ర‌గొట్టింది. 'బ్ర‌హ్మ‌ముడి' సీరియ‌ల్‌ను ప్రైమ్ టైమ్ నుంచి మ‌ధ్యాహ్నం స్లాట్‌లోకి షిఫ్ట్ చేశారు. అయినా సీరియ‌ల్‌కు ఉన్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డానికి దీపికా రంగ‌రాజుకు ఉన్న క్రేజ్ కూడా ఓ కార‌ణం. దీపికా రంగ‌రాజు త్వ‌ర‌లో మొద‌లు కాబోతున్న బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9లోకి ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Readవెండితెరపై 'కార్తీక దీపం' డాక్ట‌ర్‌ బాబు... హీరోగా & విల‌న్‌గా న‌టించిన సినిమాల లిస్ట్... ఏవో తెలుసా?