Tata Punch Update: నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సక్సెస్ తర్వాత భారతదేశంలో టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడైన రెండో ఎస్‌యూవీగా టాటా పంచ్ నిలిచింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఫ్రంట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు పోటీగా, టాటా మోటార్స్ ఇప్పుడు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పంచ్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌ల్లో మార్పులు చేసింది. పంచ్ లో ఎండ్ వేరియంట్‌లను పరిశీలిస్తే ట్రిప్ మీటర్, ఓడోమీటర్, స్పీడ్ టైమ్, వార్నింగ్ లైట్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే 4 అంగుళాల డిజిటల్ స్క్రీన్‌తో కనిపిస్తుంది. అయితే టాప్ వేరియంట్ అయిన క్రియేటివ్ ఆఫ్ పంచ్ 7.0 అంగుళాల పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.
టాటా పంచ్ డిజిటల్ క్లస్టర్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని ప్రైమరీ ఫీచర్‌గా చేర్చడం వల్ల దాని ధరపై స్వల్ప ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ధరలను పెంచినట్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ అప్‌డేట్ హ్యుందాయ్ ఎక్సెంట్‌పై టాటా పంచ్‌కు పై చేయిని అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్సెంట్‌లో 4.2 అంగుళాల ఎంఐడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రైమరీగా అందించారు. హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ఉండగా, టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.10 లక్షల మధ్య ఉంది.
త్వరలో టాటా పంచ్ ఈవీ
టాటా మోటార్స్ త్వరలో పంచ్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ పెద్ద 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఇది ఎక్కువ ట్రిమ్‌ల్లో కనిపిస్తుంది. 10.25 అంగుళాల యూనిట్ లోయర్, మిడ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. దాని ఐసీఈ మోడల్ డిజైన్‌తో పాటు టాటా పంచ్.ఈవీకి సంబంధించిన కొన్ని వేరియంట్‌లలో సన్‌రూఫ్ కూడా చూడవచ్చు. ఇది ఈ ఫీచర్‌తో వచ్చే అత్యంత చవకైన EV అవుతుంది.
టాటా పంచ్ ఈవీ ఇంజిన్ ఎలా ఉండనుంది?
కంపెనీ రూపొందించిన జిప్‌ట్రాన్ పవర్‌ట్రెయిన్‌ను టాటా పంచ్ ఈవీలో ఉపయోగించనున్నారు. ఇందులో ముందు బంపర్‌పై ఛార్జింగ్ సాకెట్ కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ టాటా జెన్ 2 ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందనుంది. ఇది భారీగా అప్‌డేట్ అయిన ఆల్ఫా ఆర్కిటెక్చర్ వెర్షన్. ఇందులో ఎలక్ట్రిక్ వేరియంట్ డిజైన్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. ఈ కారుతో టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను మరింత విస్తరించనుంది.
టాటా పంచ్.ఈవీని 2023 చివరిలో, కర్వ్.ఈవీని 2024 ప్రారంభంలో టాటా మోటార్స్ లాంచ్ చేయనుంది. ఈ రెండూ మాత్రమే కాకుండా 2025లో హారియర్.ఈవీని కూడా లాంచ్ చేయడానికి టాటా సన్నాహాలు చేస్తుంది. జెన్ 1, జెన్ 2 ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా రాబోయే కొత్త ఈవీలు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ అందించనున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!