Telangana Elections 2023 Priyanka Gandhi : ఎన్నికల టైంలో బీఆర్ఎస్ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ  తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం  తొర్రూరులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు .  పదేండ్లుగా తెలంగాణలో బీఆర్ ఎస్ అధికారంలో ఉంది.. ఏ లక్ష్యం కోసమైతే  రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవి ఒక్కటైనా నెరవేరాయా   అని ప్రశ్నించారు. ఈ పదేళ్లలో ఎంత మంది యువకులు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారో  బీఆర్ ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు.  ఉద్యోగాలకోసం యువత కష్టపడుతుంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రం లీకులు చేస్తోందని ఆరోపించారు ప్రియాంక గాంధీ.  పేపర్ లీకులతో యువతి ఆత్మహత్య చేసుకుంటే తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. యువకులే దేశ నిర్మాతలు.. అలాంటి యువత అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. అధికారంలోకి రాగనే యువత, నిరుద్యోగులకోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. 


పదేళ్లో రైతుల నుంచి బీఆర్ ఎస్ ప్రభుత్వం భూములను లాక్కొందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. త్యాగాలతో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీని గెలించుకుంటే ఏ లక్ష్యంతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో.. అవి నేరవేరుతాయని ప్రియాంక గాంధీ చెప్పారు.   అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌కు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసిందని.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే.. వాటిని ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు కుమ్మక్కు అయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు పేదల కోసం చేసిందేమి లేదని స్పష్టం చేశారు. 


పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహంకారంతో విర్రవీగుతున్నాయని, సామాన్యులు, రైతుల సంక్షేమం గురించి ఈ ప్రభుత్వాలు మరిచిపోయాయని మండిపడ్డారు.  తప్పు చేసిన పిల్లలకు తల్లిదండ్రులు బుద్ధి చెప్పినట్లుగానే ప్రజల ఆకాంక్షలను మర్చిపోయిన బీఆర్ఎస్ సర్కార్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలు, బలిదానాలతో ఏర్పడిందని త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ పురోగతి సాధించాలంటే రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.   





 
 
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. తెలంగాణలో యువశక్తి నారీశక్తి చూస్తే గర్వంగా ఉందన్నారు.కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేయబోతున్నామన్నారు. ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇవ్వబోతున్నామన్నారు. ఎంఎస్పీ కల్పించి ఆదుకుంటామన్నారు.                             


    
ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply