Tata Punch Facelift SUV: టాటా మోటార్స్ 2024 కోసం గొప్ప ప్లాన్లతో రెడీగా ఉంది. ప్రస్తుతం కంపెనీ ఏడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. టాటా పంచ్ ఈవీ ఈ స్ట్రాటజీతో వచ్చిన కంపెనీ మొదటి మోడల్. దీని తర్వాత మరో ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీ ఉంటుంది. కర్వ్ ఐసీఈ మోడల్ 2024 ద్వితీయార్థంలో వస్తుందని భావిస్తున్నారు. ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్పోర్టియర్ వెర్షన్ అయిన ఆల్ట్రోజ్ రేసర్‌ను కూడా కంపెనీ తీసుకువస్తుంది. ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి కనిపించింది. టాటా హారియర్ ఈవీ, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ కూడా కంపెనీ 2024 ఉత్పత్తి లాంచ్ స్ట్రాటజీలో భాగంగా ఉంది.


టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
ఈ సంవత్సరం టాటా అత్యంత ప్రజాదరణ పొందిన టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీకి మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను కూడా ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ అప్‌డేటెడ్ మోడల్ వివరాలు తెలియరాలేదు. అయితే కొత్త 2024 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ చాలా అధునాతన ఇంటీరియర్‌లను పొందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను నెక్సాన్‌లో పెద్ద, కొత్త 10.25 అంగుళాల యూనిట్‌తో భర్తీ చేయవచ్చు. ఇది మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ కోసం వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంటుంది.


మరిన్ని ఫీచర్లను కూడా...
టాటా తాజా మోడల్‌ల మాదిరిగానే కూడా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఏడు అంగుళాల సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేకు బదులుగా కొత్త 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ మైక్రో ఎస్‌యూవీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా పొందవచ్చు. దీని కారణంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు పంచ్ మరింత పోటీని ఇవ్వనుంది.


కొత్త 2024 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొన్ని బ్యూటీ ఛేంజెస్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. కొత్త బ్లాక్ అవుట్ గ్రిల్, కొత్త కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, స్పష్టమైన స్కిడ్ ప్లేట్, అప్‌డేట్ చేసిన బంపర్, కొద్దిగా అప్‌డేట్ చేసిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభించే అవకాశం ఉంది. దీని వెనుక ప్రొఫైల్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అంటే వెనక నుంచి చూస్తే రెండిటికీ పెద్ద తేడా ఉండదన్న మాట.


టాటా పంచ్ ఈవీ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. 2024లో టాటా లాంచ్ చేసిన మొదటి కారు పంచ్ ఈవీనే కావడం విశేషం. దీనికి సంబంధించిన బుకింగ్‌ను కూడా టాటా ప్రారంభించింది. మీరు టాటా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే రూ. 21,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!