భారత మార్కెట్‌లో అధిక మైలేజీనిచ్చే, తక్కువ ధర కార్లకు చాలా డిమాండ్ ఉంది. టాటా పంచ్ అదే కేటగిరీలోకి వస్తుంది. దీనిని బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అని కూడా అంటారు. టాటా పంచ్ కారు ధర రూ.7 లక్షల రూపాయల రేంజ్‌లో ఉంది.

మీరు ఈ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లు అయితే, టాటా పంచ్‌ను కొనడానికి మీరు పూర్తిగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ కారును ఫైనాన్స్ ద్వారా తీసుకోవచ్చు. టాటా కంపెనీ ఈ కారును కార్ లోన్ (Car Loans) ద్వారా కూడా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం మీరు ప్రతి నెలా కొన్ని వేల రూపాయలు EMI రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

ఎంత డౌన్ పేమెంట్ చేస్తే టాటా పంచ్ వస్తుంది..

Cardekho వెబ్‌సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం, టాటా పంచ్ కారు ప్యూర్ పెట్రోల్ వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ. 6.66 లక్షలు. టాటా పంచ్ కారును కొనుగోలు చేయడానికి, మీరు బ్యాంకు నుంచి రూ. 5.99 లక్షల వరకు లోన్ పొందుతారు. కార్ లోన్ మొత్తం మీ క్రెడిట్ స్కోర్ మీద  ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటే వడ్డీ తగ్గుతుంది. ఈ లోన్‌పై వడ్డీ రేటు ప్రకారం, మీరు ప్రతి నెలా మీరు కొంత నగదు మొత్తాన్ని EMI రూపంలో బ్యాంకులో జమ చేయాలి.

టాటా పంచ్ ఈ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి రూ. 60 వేల డౌన్ పేమెంట్ చేయాలి. టాటా పంచ్ కొనుగోలుపై బ్యాంకు 9.8 శాతం వడ్డీని వేస్తే.. మీరు ఈ లోన్‌ను 4 సంవత్సరాలు కనుక చెల్లించాలనుకుంటే మీరు ప్రతి నెలా రూ. 15,326 EMI రూపంలో చెల్లించాలి. మీరు 10 వేల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే, మొత్తం నాలుగు సంవత్సరాలు దాదాపు రూ. 18,282 EMIగా చెల్లించాలి.

EMI వివరాలు తెలుసుకుంటే బెటర్

మీరు టాటా పంచ్ కారు లోన్‌ను 5 సంవత్సరాలకుగానూ తీసుకుంటే, 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా దాదాపు రూ. 12,828 ఈఎంఐ చెల్లించాలి.  టాటా పంచ్ ధర దేశంలోని రాష్ట్రాలను బట్టి అక్కడి పన్నులు, ఇతర కారణాలతో మారుతుంది. అన్ని రాష్ట్రాల్లో టాటా పంచ్ కారు ఒకే ధరకు లభించదు. టాటా పంచ్‌పై లభించే కారు లోన్ సైతం వ్యక్తిని, రాష్ట్రాలను బట్టి కూడా మారవచ్చు. కార్ లోన్‌పై వడ్డీ రేటులో వ్యత్యాసం ఉంటే, EMIలో కూడా వ్యత్యాసం ఉంటుంది. కార్ లోన్ తీసుకునే ముందు డౌన్ పేమెంట్ సహా ఈఎంఐ వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.