Hyundai Exter CNG Price Feafures | భారత మార్కెట్లో మైక్రో SUVల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు CNG కార్ల కొనుగోలుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా 10 లక్షల రూపాయల లోపు బడ్జెట్ ఉన్న కస్టమర్లు హ్యూందాయ్ కంపెనీకి చెందిన Hyundai Exter CNG, టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG) లలో ఏది బెస్ట్ అని ఆలోచనలో పడుతుంటారు. ఈ రెండు SUVలు వాటి ధర, ఫీచర్లు, మైలేజ్, పనితీరు కారణంగా బాగా ప్రాచుర్యం పొందాయి. మీ కోసం ఏ SUV కొనడం మంచిదో తెలుసుకుందాం.
ఏ SUV కొనడం బెటర్
హ్యూందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter CNG) అనేక ట్రిమ్స్‌లో వస్తుంది. దీని ప్రారంభ ధర 7.51 లక్షలు, అయితే టాప్ వేరియంట్ 8.77 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు Tata Punch CNG బేస్ మోడల్ రూ. 6.68 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది ఎక్స్టర్ తో పోలిస్తే చాలా చౌకగా ఉంటుంది. అంటే తక్కువ బడ్జెట్ ఉన్న కస్టమర్లకు Tata Punch CNG మీ నగదుకు విలువైన అసలు సిసలైన ఎంపికగా నిలుస్తుంది.
కారు డిజైన్ ఎలా ఉంది?
బయటి డిజైన్ విషయానికి వస్తే.. రెండు కార్లలో హాలోజన్ హెడ్‌లైట్లు ఉంటాయి. కానీ Hyundai Exter LED టెయిల్ ల్యాంప్స్‌తో మరింత మోడ్రన్ లుక్ అందిస్తుంది. ఇంటీరియర్‌లో, రెండు SUVలు ఫ్యాబ్రిక్ సీట్లు, ఫ్రంట్ పవర్ విండోలు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లను అందిస్తాయి. అయితే ఎక్స్టర్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ దీనిని కొంచెం అడ్వాన్స్‌డ్‌గా చేస్తుంది. మరోవైపు టాటా Punch CNG లో 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు రోజువారీ డ్రైవింగ్ కోసం దీనిని మరింత ప్రాక్టికల్‌గా చేస్తాయి.
ఏ కారు ఎక్కువ సేఫ్ ?
Hyundai Exter CNG అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది వాహనదారుల భద్రత విషయంలో దీనిని బెస్ట్ ఎంపికగా చేస్తుంది. అయితే Tata Punch లో ప్రస్తుతం 2 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే టాటా Punch లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) అందించారు. ఇది హ్యూందాయ్ ఎక్స్టర్ లో లేదు. మిగిలిన బేసిక్ సేఫ్టీ ఫీచర్లు అయిన ABS+EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు రెండింటిలోనూ సమానంగా ఉన్నాయి. మొత్తంమీద, ఎక్స్టర్ మరింత సురక్షితమైన ఎంపికగా నిరూపితమైంది.
ఇంజిన్, పనితీరు
హ్యూందాయ్ Hyundai Exter CNG లో 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. అయితే Punch CNG లో 3-సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. టాటా Punch పవర్ విషయంలో ముందుంది. ఇది 72.4 BHP, 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎక్స్టర్ 68 BHP, 95.2 Nm కంటే ఎక్కువ. పనితీరు విషయంలో టాటా Punch CNG మరింత శక్తివంతంగా అనిపిస్తుంది.
ఏ కారు చౌకైనది?
Hyundai Exter CNG మైలేజ్ 27.1 km/kg ఇస్తుంది. అయితే Tata Punch CNG 26.99 km/kg అందిస్తుంది. దీన్ని మనం వ్యత్యాసంగా చెప్పలేం. రోడ్లను బట్టి ఇందులో చాలా స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.
Also Read: Discount On Cars: ఈ 4 కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు బెనిఫిట్