Bad Girlz Movie Teaser Out Now : దాదాపు 20 ఏళ్ల తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు'తో రేణూ దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో వరుసగా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం 'బ్యాడ్ గాళ్స్' మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటుండగా... ఆమె పొలిటికల్ లీడర్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

'బ్యాడ్ గాళ్స్' మూవీకి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ఫేం ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహిస్తుండగా... అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా టీజర్‌ను రిలీజ్ చేశారు. 

టీజర్ ఎలా ఉందంటే?

Continues below advertisement

పెళ్లికి ముందే చేసే ఎంజాయ్‌మెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంటూ నలుగురు అమ్మాయిలు చేసిన అల్లరే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరికి ఎదురయ్యే సంఘటనలు, లవ్, ఎంజాయ్మెంట్ వల్ల వీరు పడ్డ ఇబ్బందులను టీజర్‌లో చూపించారు. ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఈ మూవీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై... శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'సుకుమార్‌కు కథలు చెప్పేవారు'

'బ్యాడ్ గాళ్స్' స్టోరీ చాలా బాగుందని... క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుందని అన్నారు బుచ్చిబాబు. 'నేను సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు మున్నా ఆయన దగ్గరకు వచ్చేవాడు. తాను రాసుకున్న కథలు చెప్పి ఆయనతో ఓకే చేయించుకునేవారు. మున్నాను చూసి మనం కూడా డైరెక్టర్ అవ్వాలి అనుకునేవాడిని. ఉప్పెనలో 'నీ కన్ను నీలి సముద్రం' పాట ఎంత హిట్ అయిందో దానికి డబుల్ హిట్ అయింది 'నీలి నీలి ఆకాశం'.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. 'మనం' సినిమా పాటలకి నేను పెద్ద ఫ్యాన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్ గారు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె ఈ సినిమా ఒప్పుకున్నారంటే సినిమా ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అందరూ తప్పక చూడండి.' అని తెలిపారు.

Also Read : 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా 'బ్యాడ్ గాళ్స్' అని డైరెక్టర్ ఫణి తెలిపారు. ఇది మంచి ఎంటర్టైనర్ అని అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తే చంద్రబోస్ లిరిక్స్ రాశారని తెలిపారు. 

తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య తదితరులు.

సాంకేతిక బృందం: దర్శకుడు: ఫణి ప్రదీప్ ధూళిపూడి, బ్యానర్స్: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్, నిర్మాతలు: శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె ఎమ్ కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్, లిరిక్స్: ఆస్కార్ చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్: ఆర్లి గణేష్, ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి.