దేశీయ కార్ల తయారీ సంస్ధ టాటా మోటార్స్ నుంచి మరో లేటెస్ట్ కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. టాటా పంచ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా టాటా పంచ్ కామో ఎడిషన్ ను రిలీజ్ చేసింది. దేశీయ మార్కెట్లో ఈ లేటెస్ట్ కారు ధర రూ. 6.85 లక్షలుగా (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ఫిక్స్ చేసింది. కాజిరంగ ఎడిషన్ తర్వాత టాటా పంచ్‌ సిరీస్‌ లో వచ్చిన లేటెస్ట్ స్పెషల్ ఎడిషన్ కారు ఇదే కావడం విశేషం. ఇంతకీ ఈ కొత్త కారు ప్రత్యేతలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


టాటా పంచ్ కామో ఎడిషన్ ప్రత్యేకతలు


సరికొత్త ఎడిషన్ లో కంపెనీ చాలా మార్పులు చేసింది. కాస్మెటిక్, స్టైలింగ్ లోనూ ఛేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ కారు పియానో ​​బ్లాక్ అండ్ ప్రిస్టీన్ వైట్ డ్యుయల్ టోన్ రూఫ్ కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. సరికొత్త ఫోలేజ్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌ తో వినియోగదారుల చెంతకు చేరింది. ఈ కారు  ఫెండర్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, 16-అంగుళాల చార్‌ కోల్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ పై కామో బ్యాడ్జింగ్‌ ను కలిగి ఉంది. పంచ్ తో పోల్చితే పంచక కామోలో పెద్దగా మార్పులు ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. ఇక తాజా SUVలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 7.0- ఇంచుల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంది. అటు 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్స్ ను కలిగి ఉంది.  కామో ఎడిషన్ ఇంటీరియర్ మిలిటరీ గ్రీన్ కలర్‌ ను కలిగి ఉంది.


టాటా పంచ్ కామో ఎడిషన్ మోటార్ ప్రత్యేకతలు


టాటా పంచ్‌ కామో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఈ ఎస్‌యూవీ  1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ప్యూయల్ ను  పొదుపుగా వాడే స్టార్ట్, స్టాప్ ఫంక్షనాలిటీ ఈ ఇంజిన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ కారు 6000 ఆర్‌పీఎం దగ్గర 84.48 హెచ్‌పీ పవర్‌ను, 3300 ఆర్‌పీఎం దగ్గర 113 ఎన్ఎం అత్యధిక టార్క్‌ను అందిస్తుంది.  


టాటా పంచ్ కామో ఎడిషన్ ధర ఎంతంటే?


ఇప్పటికే మార్కెట్లో ఉన్న  టాటా పంచ్ వేరియంట్ల ధరలు ప్రస్తుతం రూ. 5.93 లక్షల నుంచి రూ. 9.49 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు కలిగి ఉన్నాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన  కామో SUV ధర భారత్ లో రూ. 6.85 లక్షల నుంచి రూ. 8.63 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు కలిగి ఉంది. టాటా పంచ్ కామో అడ్వెంచర్, అకాంప్లిష్డ్ ట్రిమ్ లెవల్స్‌ లో మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆయా మోడల్ ను బట్టి ధరలో మార్పులు ఉంటాయి.


Also Read: ఇండియాలో టాప్ 5 ఫాస్టెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కార్లు ఇవే!