భారత హ్యాచ్ బ్యాక్ కార్ల మార్కెట్ లో ఒకప్పుడు ఉన్నంత పోటీ ఇప్పుడు లేదు. ప్రజలు ఇప్పుడు SUVలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాహన తయారీ కంపెనీలు  సైతం తమ పంథాను మార్చుకున్నారు. ఇటీవలి కాలంలో  కాంపాక్ట్ SUVలు, సబ్-కాంపాక్ట్ SUVలు, మైక్రో SUVలను ఎక్కువగా తయారు చేస్తున్నారు. SUVల పెరుగుదలలో హ్యాచ్‌ బ్యాక్‌లు వైవిధ్యాన్ని కోల్పోయాయి. అయినా మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పలేం. ఇక భారత్ లోని టాప్ 5 వేగవంతమైన హాట్ హ్యాచ్‌ బ్యాక్‌ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. Mercedes Benz - AMG A 45 S 4MATIC+ - 3.9 సెకన్లు


మెర్సిడెస్ బెంజ్ గత సంవత్సరం దేశీయ మార్కెట్లో AMG A 45 S 4MATIC+ హ్యాచ్‌బ్యాక్‌ను రూ. 79.90 లక్షలకు విడుదల చేసింది (ఎక్స్-షోరూమ్). భారత్ లో అత్యంత ఖరీదైన, అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన హ్యాచ్‌బ్యాక్. AMG A 45 S 4MATIC+కు శక్తినిచ్చే 2.0 L టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 421 bhp, 500 nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.9 సెకండ్ల వ్యవధిలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది డ్రిఫ్ట్ మోడ్‌తో కూడా వస్తుంది.


2. మినీ కూపర్ JCW - 6.1 సెకన్లు


మినీ కూపర్ జాన్ కూపర్ వర్క్స్ మరొక  హాట్ హాచ్. ఇది 231 bhp 320 nm టార్క్‌ని విడుదల చేసే 4-సిలిండర్ 2.0 L పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది కేవలం 6.1 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 246 kmph. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 47.70 లక్షలు.  


3. మినీ కూపర్ 3 డోర్ - 6.7 సెకన్లు


మినీ కూపర్ 3 డోర్ అకా మినీ కూపర్ S ఈ జాబితా నుంచి విడుదల అయ్యింది. 7-స్పీడ్ డబుల్ క్లచ్ స్టెప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన మినీ కూపర్ S రూ. 40.58 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ హాచ్‌కు శక్తినిచ్చే 4-సిలిండర్ 2.0 L పెట్రోల్ ఇంజన్ 192 bhp మరియు 280 nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 6.7 సెకన్లలో 0-100 kmph  వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 235 kmph.


4. మినీ కూపర్ SE - 7.3 సెకన్లు


ఇది కూడా ఫాస్టెస్ట్ హ్యాచ్ బ్యాక్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇది ఎలక్ట్రిక్ కారు.  32.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది 50 KW ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 184 బిహెచ్‌పి పవర్, 270 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.3 సెకన్లలో 0-100 kmphవేగం అందుకుంటుంది. గరిష్ట వేగం 150 kmph.  


5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్జ్ టర్బో - 9.82 సెకన్లు


హ్యుందాయ్ i10 1.0 ఎల్ 3-సిలిండర్ హ్యాచ్‌బ్యాక్. ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.02 లక్షలు.  సాధారణ 1.2 ఎల్ స్పోర్ట్జ్ ధర రూ. 6.81 లక్షలు. ఇది  స్పోర్టియర్ i20 N లైన్ కంటే వేగంగా ఉంటుంది. ఇది 98.6 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9.82 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకోగలదు.