Hyderabad Rains : హైదరాబాద్ పై వరుణుడు విరుచుపడ్డారు. ఆగకుండా రెండు గంటలకు పైగా జడివాడ కురిపించాడు. దీంతో ప్రధాన రహదారులు నీట మునిగాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్‌, నాంపల్లి, ట్యాంక్‌బండ్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, కిస్మత్‌పురా, మెహదీపట్నం, జియాగూడా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్ నగర్, రామ్‌నగర్, దోమలగూడ, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, కోఠి వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.










ఈ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ 


 నల్గొండ ఎక్స్ రోడ్స్, మలక్ పేట్ రైల్వే స్టేషన్, అజంపురా నుంచి చాదర్‌ఘాట్ రోటరీ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పంజాగుట్ట, బేగంపేట్, GVK మాల్, తాజ్ కృష్ణ, రోడ్ నెం. 1/10, రోడ్ నెం. 1/12, ఖాజా మాన్షన్, మాసబ్ ట్యాంక్ X రోడ్ల నుంచి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. లక్డీకా పూల్ వద్ద రోడ్లపై నీరు చేరడంతో పబ్లిక్ గార్డెన్, గన్‌ఫౌండ్రీ, DGP ఆఫీస్, లక్డీకాపూల్ నుంచి సైఫాబాద్ పీఎస్ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.  ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పీవీఆర్ ఎక్స్ ప్రెస్ మార్గంలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 






హైదరాబాద్ వర్షాలు - 2 గం.లో మి.మీ



  • నాంపల్లి -92.5

  • LB స్టేడియం -86.5

  • మెహిదీపట్నం -83.5

  • ఖైరతాబాద్ -75.8

  • అల్కాపురి- 72.3

  • అత్తాపూర్ -64.3

  • హిమాయత్‌నగర్ -63.5

  • జియాగూడ -62.5

  • మలక్‌పేట -61.5

  • ఆసిఫ్‌నగర్ -52.5

  • సికింద్రాబాద్ -44.5

  • రాజేంద్రనగర్ -43.5

  • సరూర్‌నగర్ -43.5

  • షేక్‌పేట -41.3

  • అంబర్‌పేట్ -37.3