Tata Nexon vs Maruti Brezza vs Fronx CNG: గత రెండు సంవత్సరాలుగా మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, ఇంకా వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జనాలు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. ఇంధన ఖర్చులను మరింత తగ్గించుకునే విషయంలో డీజిల్, పెట్రోల్ కార్లతో పోల్చితే సీఎన్‌జీ కార్లు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా సీఎన్‌జీ కార్లను ఎక్కువగా కొంటున్నట్లు నివేదికలు కూడా అవే చెబుతున్నాయి.
సీఎన్‌జీ కార్లలో ఎక్కువగా ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా వీటి ఉత్పత్తిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ విడుదల అయ్యింది. ఇది దేశంలోనే మొదటి టర్బోఛార్జ్డ్ పెట్రోల్ సీఎన్‌జీగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఈ నెక్సాన్ సీఎన్‌జీ(Tata Nexon CNG), మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki CNG), మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Fronx CNG)లకు గట్టి పోటీని ఇస్తుంది. వీటి మధ్య ధరలు, ఫీచర్లు, మైలేజీ తదితర అంశాలు మీ కోసం..
మైలేజీ
ఈ మూడింట్లో మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఇది కిలో సీఎన్‌జీకి 28.51 కిమీ మైలేజీని ఇస్తుంది. అలాగే బ్రెజా సీఎన్‌జీ 25.51 కిమీ, నెక్సాన్ సీఎన్‌జీ 24 కిమీ మైలేజీలు ఇస్తాయి. ఈ మూడు వేర్వేరు టార్క్ అవుట్‌పుట్‌ని కలిగి ఉన్నాయి. ఫ్రాంక్స్ 77.5 bhp 98.5 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బ్రెజా 87 bhp, 121 nm టార్క్‌ని, నెక్సాన్ ఇక్కడ 98 bhp, 170 nm టార్క్‌ని విడుదల చేస్తాయి. ఇందులో నెక్సాన్ సీఎన్‌జీ అత్యంత శక్తివంతమైన కారుగా ఉంది. ఫ్రాంక్స్, బ్రెజా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ని కలిగి ఉండగా.. నెక్సాన్ సీఎన్‌జీ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
బూట్ స్పేస్
నెక్సాన్ సీఎన్‌జీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుండటంతో ఇందులో భారీ బూట్ స్పేస్ కలిగి ఉంది. ఇందులో 321 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంటుంది. దీంతో ఈ కారులో లాంగ్ జర్నీ, వీకెండ్స్‌లో ఎక్కువ లగేజీని క్యారీ చేయవచ్చు. ఇది అదనపు సౌలభ్యం అని చెప్పవచ్చు. ఇక ఫ్రాంక్స్, బ్రెజాలు సింగిల్ సిలిండర్ టెక్నాలజీ కావడం వల్ల బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది.
ధర
నెక్సాన్ సీఎన్‌జీ ప్రారంభ ధర రూ .8.99 లక్షల నుంచి రూ .14.59 లక్షల మధ్య ఉంది. బ్రెజా సీఎన్‌జీ ధర రూ.9.14 లక్షల నుంచి రూ.11.9 లక్షల మధ్యలో ఉంది. ఫ్రాంక్స్ సీఎన్‌జీ ధర రూ.8.4 లక్షల నుంచి రూ.9.2 లక్షల మధ్యలో ఉంది. వీటిలో ఫ్రాంక్స్ సీఎన్‌జీ తక్కువ ధరలో లభిస్తుంది. ఆ తర్వాత బ్రెజా ఉంది. అయితే నెక్సాన్ ఎక్కువ వేరియంట్లు, భారీ ఫీచర్లు, ఎక్కువ బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. వీటిన్నంటిలో టాటా నెక్సాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. మైలేజీలో మారుతి సీఎన్‌జీ కార్లు సరిపోతాయి. కావున మీ అవసరాలకు తగినట్లుగా సీఎన్‌జీ కార్లను ఎంచుకోండి.
Also Read: Toyota Glanza 2024 Car Review: టయోటా గ్లాంజా 2024 రివ్యూ - చవకైన ఆటోమేటిక్ కార్లలో బెస్ట్!