AP Minister Kandula Durgesh : కడియపులంక: ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక - వేమగిరి హైవే మధ్యలో రెండు బైక్ లు ఢీకొని ఓ యువతి గాయపడింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి కందుల దుర్గేష్ తన కాన్వాయ్ ఆపి బాధితురాలిని పరామర్శించారు. 


మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా తన వాహనం దిగి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని పరామర్శించి, వివరాలు సేకరించారు. దాంతోపాటు తన సిబ్బందితో యువతికి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. అనంతరం ఆ యువతికి తగిన జాగ్రత్తలు సూచించారు మంత్రి దుర్గేష్. కీలకమైన రాజకీయ అంశాలతో పాటు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలపై సైతం సాటి మనిషిగా తాను స్పందించా అన్నారు. తాను ప్రజల సేవకుడిని అనడమే కాదు, తన చేతల్లో చూపించారని స్థానికులు మంత్రి కందుల దుర్గేష్ చర్యలను ప్రశంసించారు.


Also Read: LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు