Tata Nexon EV Discount: టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఈ విభాగంలో వినియోగదారులను కూడా టాటా నెక్సాన్ ఈవీ ఆకర్షిస్తుంది. వీరి కోసం ప్రత్యేకంగా టాటా డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. ఫేస్‌లిఫ్ట్, ప్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఆఫర్ పరిమిత సంఖ్యలో ఉన్న కార్లపై మాత్రమే అందించనున్నారు.


టాటా నెక్సాన్ ఈవీ ప్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై ఏకంగా రూ.3.15 లక్షలపై డిస్కౌంట్ అందించనున్నారు. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్‌పై రూ.2.3 లక్షల డిస్కౌంట్, రూ. 50 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభించనుంది. ఇక నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ రూ.2.65 లక్షల డిస్కౌంట్, రూ.50 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.


అదిరిపోయే ఫీచర్లు
టాటా మోటార్స్ భారతదేశంలో నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను పెద్ద బ్యాటరీ ప్యాక్, మరిన్ని రేంజ్ ప్లస్ అదనపు ఫీచర్లతో విడుదల చేసింది. ఇప్పుడు స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో నెక్సాన్ ఈవీ ప్రైమ్ ద్వారా మరిన్ని ఫీచర్లు అందించనున్నారు. మల్టీపుల్ రీజెన్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, ఐ-టీపీఎంఎస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అప్‌డేట్‌లు ఇప్పటికే ఉన్న నెక్సాన్ ఈవీ ఓనర్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందుతాయి. పవర్, బ్యాటరీ ప్యాక్ పరంగా నెక్సాన్ ఈవీ, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఒకేలా ఉన్నాయి. అయితే పవర్ విషయంలో మాత్రం నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మరింత శక్తివంతంగా మారింది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే నెక్సాన్ ఈవీ ప్రైమ్ 312 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఈ కారు ధర కూడా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కంటే తక్కువగా ఉండనుంది.


భారీ బ్యాటరీ, 437 కిలోమీటర్ల రేంజ్...
టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ గతంలో మనదేశంలో లాంచ్ అయింది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ ఎక్స్‌జెడ్+ వేరియంట్ ధర అని తెలుస్తోంది. టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.19.24 లక్షలుగా ఉంది. నార్మల్ నెక్సాన్ ఈవీ ధర రూ.14.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలే అని గుర్తుంచుకోవాలి. గతంలో లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే వెర్షనే ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్. ఇందులో ఎక్కువ కెపాసిటీ ఉన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ను టాటా అందించింది. శక్తివంతమైన మోటార్, కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.


దీని డిజైన్ మాత్రం రెగ్యులర్ నెక్సాన్ ఈవీ తరహాలోనే ఉంది. ఇంటెన్సీ టియాల్, డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్ రంగుల్లో ఈ కొత్త నెక్సాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ కొంచెం కొత్తగా ఉండనుంది. 16 అంగుళాల అలోయ్ వీల్స్, ఈవీ మ్యాక్స్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు కూడా అందించనున్నారు. వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, క్రూజ్ కంట్రోల్ ఫీచర్లను కొత్త నెక్సాన్ ఈవీలో చూడవచ్చు. 


ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా నెక్సాన్ ఈవీలో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 437 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ తెలిపింది. టాటా నెక్సాన్ ఈవీ 312 కిలోమీటర్ల రేంజ్‌తో లాంచ్ అయింది. వీటిలో 40.5 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీని చూడవచ్చు. కారుతో పాటు 3.3 కేడబ్ల్యూ చార్జర్‌ను అందించనున్నారు. కానీ వినియోగదారులు 80 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జర్‌ను కొనుగోలు చేస్తే కేవలం 56 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!