Tata Motors clocks 10,000 unit sales on first day:  టాటా మోటార్స్ లిమిటెడ్ GST 2.0  అమలు మొదటి రోజు 10,000 కార్లు డెలివరీ చేసి, 25,000కి పైగా కస్టమర్  ఎంక్వయిరీలు అందుకుంది.  ఈ సంచలనాత్మక స్పందన పంచ్ , నెక్సాన్ వంటి పాపులర్ SUVలపై డిమాండ్‌తో జరిగింది. నవరాత్రి ఫెస్టివ్ సీజన్ మొదలైన ఈ సమయంలో, GST రేటు కట్ ప్రయోజకాలను పూర్తిగా కస్టమర్లకు అందించిన టాటా మోటార్స్, షోరూమ్ వాక్-ఇన్‌లు, కన్వర్షన్ రేట్లు, ఆర్డర్ బుక్‌లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈ  డిమాండ్ భారతదేశం, ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటో మార్కెట్‌లో ఆటో సెక్టార్ పునరుద్ధరణకు సంకేతంగా ఆటో వర్గాలు భావిస్తున్నాయి. 

Continues below advertisement

సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వచ్చిన GST 2.0 సవరణలు ప్యాసింజర్ వెహికల్స్‌పై GST రేట్లను తగ్గించాయి. ఇందులో సబ్-4 మీటర్ SUVలు, సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లపై ప్రధాన ప్రభావం పడింది. టాటా మోటార్స్ ఈ ప్రయోజకాలను పూర్తిగా కస్టమర్లకు అందించింది. తన లైనప్‌లోని మోడల్స్ ప్రైస్‌లను రూ.65,000 నుంచి రూ.1.55 లక్షల వరకు తగ్గించింది. ఈ మార్పు  ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ మోడల్స్‌పై మాత్రమే వర్తిస్తుంది.  EV మోడల్స్ నెక్సాన్ EV, టియాగో EV వంటి వాటిపై తగ్గలేదు.   నవరాత్రి మొదటి రోజు  సెప్టెంబర్ 22న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు ముందుగానే తెరిచి, పని గంటలు పొడిగించాయి. ఫలితంగా, 10,000 వెహికల్స్ డెలివరీ అయ్యాయి.  25,000కి పైగా ఇంక్వైరీలు వచ్చాయి.  "బుకింగ్స్ పైప్‌లైన్ బలంగా ఉంది, ఫెస్టివ్ డిమాండ్‌ను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సీజన్‌లో కొత్త రికార్డులు నమోదు చేస్తాం." అని టాటా మోటార్స్ తెలిపింది. 

పంచ్ , నెక్సాన్ మోడల్స్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. నెక్సాన్, భారతదేశంలో టాప్ సబ్-కాంపాక్ట్ SUVగా ఆగస్టు 2025లో మారుతి బ్రెజ్జాను దాటింది. పంచ్, మైక్రో SUV సెగ్మెంట్‌లో ఫస్ట్-టైమ్  బయర్స్ కు ఫేవరేట్‌గా మారింది.  FY25లో టాటా మోటార్స్ PV సేల్స్ 1,46,999 యూనిట్లకు చేరాయి. పంచ్  నంబర్ 1 SUVగా నిలిచింది. GST 2.0 సవరణలు ఆటో ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చాయి. SUVలపై GST 28% + 22% కంపెన్సేషన్ సెస్ (సబ్-4 మీటర్ డీజిల్ మోడల్స్) తగ్గడంతో, కస్టమర్లు ఇప్పుడు మరింత చౌకగా కొనుగోలు చేయగలుగుతున్నారు. ఈ మార్పు కోవిడ్ తర్వాత డిమాండ్‌ను  పెంచింది. టాటా మోటార్స్ వంటి మేకర్లు మరిన్ని డిస్కౌంట్లు, ఫైనాన్సింగ్ ఆప్షన్లు ప్రకటించి, ఫెస్టివ్ సేల్స్‌ను పెంచుతున్నారు. 

Continues below advertisement

అయితే, EV మోడల్స్‌పై GST రేట్లు మారలేదు (5% హ్యాచ్‌బ్యాక్‌లు, 12% SUVలు). టాటా మోటార్స్ FY25లో 2 లక్షల EV సేల్స్ మైలురాయిని చేరింది. కొత్ కుర్వ్, నెక్సాన్ CNG, టియాగో మోడళ్లకు  మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం PV క్యూములేటివ్ సేల్స్ 60 లక్షలు మించాయి.