Tata Curvv EV Long Term Driving Report: సాధారణంగా, ఎలక్ట్రిక్ కార్లు వర్షాలలో బలహీనంగా మారతాయని చాలా మంది అనుకుంటారు. కానీ Tata Curvv EV ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పని రుజువు చేసింది. ముఖ్యంగా, ముంబైని ముంచేసిన భారీ తుపాను వర్షాల్లో కూడా ఇది ఒక సైలెంట్ హీరోలా రాణించింది. 7,300 కి.మీ. దూరం తిరిగిన తర్వాత, ముంబైలో నివశిస్తున్న Tata Curvv EV ఓనర్ కమ్ డ్రైవర్ ఇచ్చిన రివ్యూ ఇది.
నీళ్లు నిండిన రోడ్లపైనా నమ్మకం కలిగించిన డిజైన్
పెట్రోల్, డీజిల్ కార్ల ఎగ్జాస్ట్ లేదా ఎయిర్ ఇన్‌టేక్‌లో నీరు చేరితే, ఆ కార్లు ఆగిపోవడం సహజం. కానీ EVలకు ఆ భయం ఉండదు. Curvv EVలో బ్యాటరీ, మోటార్ IP67 సర్టిఫైడ్. అంటే, ఒక మీటరు లోతు నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నా సేఫ్. అందుకే నీరు నిలిచిన వీధుల్లోనూ సైలెంట్‌గా, టెన్షన్ లేకుండా వెళ్లగలిగారు.
డైలీ డ్రైవింగ్ అనుభవం
ప్రతిరోజూ డ్రైవ్ చేయడానికి ఈ కారు చాలా సౌకర్యంగా ఉంది. ఎలాంటి వైబ్రేషన్, ఇంజిన్ శబ్దం లేకుండా స్మూత్‌గా నడిచింది. “Sport Mode”లో ఎక్కువ సేపు వాడినా ట్రాఫిక్‌లో సులభంగా కట్ అవుతుంది. మొదట, ఆక్సిలరేషన్ టచ్ కొంచెం స్లోగా అనిపించినా.. డ్రైవింగ్‌ను స్మూత్‌గా చేయడానికి డిజైన్ పరంగా తీసుకున్న నిర్ణయం అది.
ఉపయోగకరమైన ఫీచర్లు
చార్జింగ్ ఫ్లాప్: కారు మధ్యలో ఉండటంతో ఎక్కడైనా చార్జ్ చేయడం సులువు.
బూట్ స్పేస్: 500 లీటర్ల బూట్ ఉండడం వల్ల సూట్‌కేసులు, లగేజ్ కోసం పర్ఫెక్ట్.
JBL సౌండ్ సిస్టమ్: క్లారిటీ, బాస్ అద్భుతంగా ఉన్నాయి.
ఫీచర్లు: పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ Android Auto/CarPlay వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి.
మైనస్‌లు లేవా?
Tata Curvv EV, ఒక రోజు 12V auxiliary battery ఫెయిల్ కావడం వల్ల కారు పూర్తిగా డెడ్ అయింది. టెర్మినల్ రీసెట్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. కానీ, ఈ ఒక్క సంఘటనతో Tata కార్ల నమ్మకాన్ని ప్రశ్నించలేము. అలాగే 18 అంగుళాల టైర్లు రోడ్డుపై గుంతలు ఉన్నప్పుడు జర్క్ ఇస్తున్నట్లు అనిపిస్తాయి, 17 అంగుళాల టైర్లు ఉండి ఉంటే మరింత కంఫర్ట్‌గా ఉండేది.
రియర్ సీటింగ్ సమస్య
Curvv EVలో వెనుక సీట్‌లో హెడ్‌రూమ్ తక్కువ. ఆ సీటు కింద బ్యాటరీ ఉండటంతో, ఫ్లోర్ కాస్త పైకి లేచి, కాళ్లు కొంచెం పైకి పేపి కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది.
హైవేలో పెర్ఫార్మెన్స్
హైవే స్పీడ్స్‌లోనూ ఈ కారు చాలా స్థిరంగా ఉంది. టాటా కార్ల ప్లాట్‌ఫామ్ మాస్ బిల్డ్ క్వాలిటీ కారణంగా ఇది సాధ్యమైంది. కానీ స్టీరింగ్ వీల్ ఫీడ్‌బ్యాక్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అయినప్పటికీ దీని ఖచ్చితత్వం సిటీ రోడ్లకు సరిపోతుంది.
చివరి మాట
7,300 కి.మీ. లాంగ్ డ్రైవింగ్ అనుభవం తర్వాత చెప్పేదేమిటంటే - Tata Curvv EV ఒక మంచి డైలీ కారు. వర్షాకాలపు రోడ్లపై సైలెంట్‌గా నడవడం, పెద్ద బూట్, శక్తిమంతమైన బ్యాటరీ రేంజ్ అన్నీ దీనికి ప్లస్ పాయింట్లు. కొన్ని చిన్న సమస్యలు ఉన్నా, ఇది రోజువారీ వాడకానికి సేఫ్ & కంఫర్ట్‌గా ఉంటుంది.