2025 సెప్టెంబర్ 28 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 28th 2025
మేష రాశి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పూర్తవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు. పరిపాలనా రంగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. కుటుంబంలో పరస్పర సామరస్యం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి. ఆస్తిలో పెట్టుబడి లాభదాయకం.
శుభ సంఖ్య: 3 రంగు: ఎరుపు పరిహారం: గణేశుడికి ఎర్రటి పువ్వులు సమర్పించి ధ్యానం చేయండి.
వృషభ రాశి
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగుల పనితీరు ప్రశంసలు అందుకునేలా ఉంటుంది. శుభవార్త వింటారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పెరిగే అవకాశం ఉంది.
శుభ సంఖ్య: 6 రంగు: తెలుపు పరిహారం: గురువారం రావి చెట్టుకి నీరు సమర్పించండి.
మిథున రాశి
అనవసరమైన పనుల్లో చిక్కుకోవచ్చు, సమయం మరియు డబ్బు వృధా అవుతుంది. కోపం తెచ్చుకోవద్దు. వ్యాపారంలో భాగస్వామ్యాన్ని ఆలోచించి చేయండి. పని రంగంలో మార్పులను వాయిదా వేయండి. కుటుంబంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
శుభ సంఖ్య: 5 రంగు: ఆకుపచ్చ పరిహారం: బుధవారం ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయండి
కర్కాటక రాశి
వివాదాలకు దూరంగా ఉండండి. అధికారులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు శత్రువుల కారణంగా ఇబ్బందిపడతారు. కుటుంబంలో విభేదాలు కొనసాగుతాయి. భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణంలో జాగ్రత్త వహించండి.
శుభ సంఖ్య: 2 రంగు: తెలుపు పరిహారం: సోమవారం శివునికి పాలతో అభిషేకం చేయండి.
సింహ రాశి
ఆనందంతో నిండి ఉంటుంది. ఇంట్లో కొత్త అతిథి రాక ఉంటుంది. శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో లాభం పొందే సూచనలు ఉన్నాయి. శుభ సంఖ్య: 1 రంగు: బంగారు పరిహారం: ఆదివారం సూర్య భగవానుడికి నీరు సమర్పించి గాయత్రీ మంత్రాన్ని జపించండి.
కన్యా రాశి
కొత్త పని ప్రారంభించడం శుభప్రదం. పని రంగంలో కొత్త సహచరులు కలుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పుల నుంచి విముక్తి . కుటుంబంలో సంతోషం ఉంటుంది శుభ సంఖ్య: 5 రంగు: ఆకుపచ్చ పరిహారం: బుధవారం గణేశుడికి దూర్వ సమర్పించండి.
తులా రాశి
కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. పని కారణంగా దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో సమయం అనుకూలంగా ఉంటుంది. జీవిత భగాస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆస్తి సంబంధిత పనుల్లో సమస్యలు.
శుభ సంఖ్య: 6 రంగు: నీలం పరిహారం: శుక్రవారం దుర్గామాతకు పూజచేయండి వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. మాట మీద అదుపు ఉంచుకోండి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఆలోచనలు బయటివారితో పంచుకోవద్దు. కుటుంబ అంతర్గత విషయాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. కోర్టు కేసుల వివాదాలకు దూరంగా ఉండండి.
శుభ సంఖ్య: 9 రంగు: ఎరుపు పరిహారం: మంగళవారం హనుమంతునికి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ధనుస్సు రాశి
కొత్త పని ప్రారంభించడంలో సక్సెస్ అవుతారు. అనుకోకుండా గతంలో పరిచయం ఉన్న వ్యక్తిని కలుస్తారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అనుకూలం. వ్యాపారంలో లాభం. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు.
శుభ సంఖ్య: 3 రంగు: పసుపు పరిహారం: గురువారం సరస్వతీ దేవికి పసుపు పువ్వులు సమర్పించండి.
మకర రాశి
అనవసరమైన పనుల్లో చిక్కుకోవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థుల కుట్రలకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో నష్టం , ఉద్యోగస్తులకు భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. కుటుంబంలో ఆస్తి విషయంలో గొడవలుంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.
శుభ సంఖ్య: 8 రంగు: నలుపు పరిహారం: శనివారం శని దేవునికి నూనె సమర్పించండి.
కుంభ రాశి
ఈ రోజు మీకు సమస్యలతో నిండి ఉంటుంది. కోర్టు కేసులు లేదా వ్యాపార నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థులు కుట్రలకు బలవుతారు. పెద్ద పెట్టుబడులు వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మాట మీద అదుపు ఉంచుకోండి.
శుభ సంఖ్య: 4రంగు: నీలంపరిహారం: శనివారం శని దేవునికి నూనె సమర్పించండి.
మీన రాశి
స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. వస్తువులను భద్రపరచుకోండి. ఆరోగ్యం , ఆహారంపై శ్రద్ధ వహించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబంలో మనస్పర్థలు ఉంటాయి. శుభ సంఖ్య: 7 రంగు: పసుపు పరిహారం: గురువారం సరస్వతీ దేవికి పసుపు పువ్వులు సమర్పించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.