Tata Curvv EV Launch: టాటా మోటార్స్ కొత్త కారు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. అదే టాటా కర్వ్ ఈవీ. టాటా కర్వ్ మొదటగా ఎలక్ట్రిక్ వేరియంట్‌తో భారతీయ మార్కెట్లోకి రానుంది. దీని తరువాత టాటా కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు భారత్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
ఆగస్టు 7వ తేదీన...
టాటా కర్వ్ ఈవీ ఆగస్ట్ 7వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారును యాక్టీ.ఈవీ బేస్ మీద రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ప్యాక్‌కు సంబంధించి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండవచ్చు.
కర్వ్ ఈవీ మిడ్ రేంజ్ వేరియంట్... నెక్సాన్ ఈవీ తరహాలో ఉంటుంది. ఈ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్ రేంజ్ 500 కిలోమీటర్లలోపు ఉంటుంది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాన్ స్టాప్‌గా 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసేయవచ్చన్న మాట. అదే సమయంలో టాటా కర్వ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ ఒకే ఛార్జింగ్‌లో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను డెలివర్ చేయగలదు.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి
మొదట ఎలక్ట్రిక్ కారు...
టాటా కర్వ్‌కు సంబంధించిన మొదట ఎలక్ట్రిక్ వేరియంట్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. దీని తర్వాత పెట్రోల్, డీజిల్ వేరియంట్లు కూడా భారత దేశ మార్కెట్లోకి రానున్నాయి. టాటా మోటార్స్ తీసుకురానున్న ఈ కొత్త కారు పొడవు 4330 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1810 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఈ కారు వీల్ బేస్ 2560 మిల్లీమీటర్లు ఉండటం విశేషం. టాటా కర్వ్ ఈవీ 500 లీటర్ల బూట్ స్పేస్‌తో రానుంది.
ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ అందించే అవకాశం ఉంది. టాటా కర్వ్ ఈవీలో అనేక ప్రీమియం ఫీచర్లు ఉండవచ్చని లీకులను బట్టి తెలుస్తుంది. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని కంపెనీ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. టాటా కర్వ్ ఈవీ, పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు అన్నిట్లోనూ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అందించే అవకాశం ఉంది. అలాగే ఈ కారులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అమర్చవచ్చు. జేబీఎల్ ఆడియో సిస్టమ్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
టాటా కర్వ్ ఈవీ మార్కెట్లో ఉన్న అనేక కార్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లకు డైరెక్ట్ కాంపిటీటర్‌గా నిలవనుంది ఉంటుంది. ఎలక్ట్రిక్ వేరియంట్‌లో ఈ కారు ఎంజీ జెడ్ఎస్ ఈవీతో పోటీ పడగలదు.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్