Tata Curvv Diesel: టాటా కర్వ్ కాన్సెప్ట్ ఆధారిత కూపే ఎస్‌యూవీ ఈ ఏడాది విడుదల కానున్న కొత్త కార్లలో ఒకటి. టాటా మోటార్స్ అధికారికంగా ఈ మోడల్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో అందించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. దాని తర్వాత దాని ఐసీఈ వెర్షన్ కూడా మార్కెట్లో లాంచ్ కానుంది. కర్వ్ ఈవీ కారు ఏప్రిల్‌లో లాంచ్ కానుంది. ఇది 2024 సెకండాఫ్‌లో మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ పుణే సమీపంలోని రంజన్‌గావ్‌లోని టాటా ఫెసిలిటీలో ఉత్పత్తి చేయబడుతుంది.


టాటా కర్వ్ డీజిల్
టాటా మోటార్స్ కర్వ్ ఎస్‌యూవీ కోసం దాదాపు 48 వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 12,000 యూనిట్లు ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని తెలుస్తోంది. ఇటీవలి నివేదికల ప్రకారం ఈ కూపే ఎస్‌యూవీ నెక్సాన్ 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఇది 115 బీహెచ్‌పీ పవర్, 260 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌లను జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.


టాటా కర్వ్ పెట్రోల్
టాటా కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ కర్వ్‌లో లాంచ్ కానుంది. ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఇంజన్ 5,000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 125 పీఎస్ శక్తిని, 1700 ఆర్పీఎం నుంచి 3500 ఆర్పీఎం మధ్య 225 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ పెట్రోల్, ఈ20 ఇథనాల్ పెట్రోల్ మిక్స్ ఫ్యూయల్‌ని నడుస్తుంది.


కొత్త పెట్రోల్ ఇంజన్ పూర్తిగా అల్యూమినియంతో తయారు చేయబడింది. ఇందులో అధునాతన ఐసీఈ సిస్టమ్, హై ప్రెజర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఉంది. ట్రాన్స్‌మిషన్ కోసం మాన్యువల్ యూనిట్, 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండనుంది.


టాటా కర్వ్ ఈవీ రేంజ్
టాటా కర్వ్ ఈవీ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ని పొందగలదు. ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ టాటా కొత్త యాక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండనుంది. ఇది ఇటీవల పంచ్ ఈవీతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఆర్కిటెక్చర్ మల్టీ బాడీ స్టైల్స్, ఇంజిన్లను సపోర్ట్ చేస్తుంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, డ్యూయల్ మోటార్ సెటప్‌ను పొందే అవకాశం ఉంది.


మరోవైపు హ్యుందాయ్ కూడా కొత్త క్రెటా తదుపరి వెర్షన్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో క్రెటా ఎన్ లైన్ కూడా ఉండటం విశేషం. త్వరలో క్రెటాలో కూడా ఎన్ సిరీస్ కారు త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. క్రెటా కారు ఎన్ లైన్... ఐ20 ఎన్ లైన్ కంటే కాస్త హయ్యర్ రేంజ్‌లో రానుందని సమాచారం. ఇటీవల లాంచ్ అయిన కొత్త క్రెటా ఎన్ లైన్ ఆధారంగా ఇందులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. క్రెటా ఎన్ లైన్ కొత్త బంపర్ ఎక్స్‌టెన్షన్‌లు, సైడ్ స్కర్ట్‌లు, పెద్ద రియర్ స్పాయిలర్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన కొత్త 18 అంగుళాల వీల్స్‌తో స్టాండర్డ్ క్రెటా కంటే స్పోర్టివ్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుండటం విశేషం.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!