Tata Altroz ​​EV Launch: టాటా మోటార్స్ భారతీయ కార్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. కంపెనీ తన అల్ట్రోజ్ ఈవీ కాన్సెప్ట్‌ను 2019లో జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. తర్వాత దీన్ని ఆటో ఎక్స్‌పో 2020లో కూడా ప్రదర్శించారు. ఇప్పుడు కంపెనీ వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లో అల్ట్రోజ్ ఈవీని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ కారును 2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది.


అయితే ఈ రాబోయే ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ నిర్దిష్ట వివరాలు సీక్రెట్‌గా ఉంచారు. అల్ట్రోజ్ ఈవీ కాన్సెప్ట్ మార్కెట్‌లో ఉన్న ఐసీఈ వేరియంట్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. లాంచ్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త డిజైన్‌ను పొందవచ్చు.


అల్ట్రోజ్ ఈవీలో టాటా తదుపరి తరం డిజైన్‌ను చూడవచ్చు. ఇందులో స్లీకర్ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఇది పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అప్‌డేట్ అయిన డాష్‌బోర్డ్, టాటా లోగోతో ఉన్న కొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీల్‌ను చూడవచ్చు.


ఫీచర్లు ఎలా ఉండవచ్చు?
ఫీచర్ల గురించి మాట్లాడుతూ కంపెనీ దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రాబోయే అల్ట్రోజ్ ఈవీ వెనుక ఏసీ వెంట్, ముందు, వెనుక ఆర్మ్‌రెస్ట్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, వెనుక కెమెరా డిస్‌ప్లే, ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మరిన్ని టెక్నాలజీ అప్‌డేట్లు చూడవచ్చు.


ఆల్ట్రోజ్ ఈవీ పవర్‌ట్రెయిన్
వినిపిస్తున్న వార్తల ప్రకారం నెక్సాన్ ఈవీ పవర్‌ట్రెయిన్ అల్ట్రోజ్ ఈవీలో చూడవచ్చు. నెక్సాన్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 30 కేడబ్ల్యూహెచ్ (మిడ్ రేంజ్), 40.5 కేడబ్ల్యూహెచ్ (లాంగ్ రేంజ్) బ్యాటరీలతో ఇవి రానున్నాయి. వీటిలో మిడ్ రేంజ్‌ది 215 ఎన్ఎం పీక్ టార్క్, 129 బీహెచ్‌పీ పవర్‌ను, లాంగ్ రేంజ్ వేరియంట్ 142 బీహెచ్‌పీ పవర్, 215 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌లను జనరేట్ చేస్తాయి.


ఆల్ట్రోజ్ ఈవీ రేంజ్ ఎంత?
టాటా ఆల్ట్రోజ్ ఈవీ రేంజ్ గురించి చెప్పాలంటే ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. దీని ధర రూ. 12 లక్షల నుంచి 15 లక్షల మధ్య ఉండనుంది.


మరోవైపు హ్యుందాయ్ తన 2024 క్రెటా మోడల్‌ను ఇటీవలే భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 10.99 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది. కొత్త క్రెటా భారీ మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. దాని ఫీచర్ లిస్ట్‌లో బోలెడన్ని అప్‌డేట్లు చూడవచ్చు. ముఖ్యంగా ఈ కారు డిజైన్ అయితే చాలా వరకు మారింది. కొత్త క్రెటా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!