Suzuki V Strom SX Year End Offers 2025: భారత్‌లో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగం వేగంగా పెరుగుతున్న తరుణంలో... సుజుకి V-స్ట్రామ్ SX యువ రైడర్లకు మంచి ఆప్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా... టూరింగ్, రోజువారీ ప్రయాణాలు, అప్పుడప్పుడు ఆఫ్-రోడ్ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఈ బైక్ సరైన బ్యాలెన్స్ అందిస్తుంది. ఈ సంవత్సరాంతం సమయంలో, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా V-స్ట్రామ్ SXపై ప్రత్యేక ఇయర్ ఎండ్ బెనిఫిట్స్ ప్రకటించింది.

Continues below advertisement

కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం... ప్రస్తుతం V-స్ట్రామ్ SX కొనుగోలు చేసే కస్టమర్లకు 100 శాతం వరకు లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే, ఒక్క రూపాయి కూడా డౌన్ పేమెంట్ లేకుండానే ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు, రూ.8,000 వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు. సాధారణంగా కొత్త బైక్ కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ ఖర్చు పెద్ద భారం అవుతుంది. ఈ ఆఫర్‌తో ఆ ఖర్చు కూడా తగ్గుతుంది.

ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, హైపోతెకేషన్ లేకుండా ఫైనాన్స్ సౌకర్యం. అంటే RC బుక్‌లో బ్యాంక్ ఎంట్రీ లేకుండా బైక్ పూర్తిగా మీ పేరుపైనే ఉంటుంది. భవిష్యత్తులో రీసేల్ లేదా ట్రాన్స్‌ఫర్ సమయంలో ఇది ఉపయోగకరంగా మారుతుంది. ఈ అన్ని బెనిఫిట్స్‌తో పాటు, సుజుకి 10 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందిస్తోంది. ఇది ఈ సెగ్మెంట్‌లో చాలా అరుదైన ఆఫర్ అని చెప్పాలి.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ధర

ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో, సుజుకి V-స్ట్రామ్ SX ఎక్స్‌-షోరూమ్‌ ధర 2,00,814 రూపాయలు. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు 2.42 లక్షలు అవుతుంది. ఇయర్ ఎండ్ ఆఫర్లతో కలిపి చూస్తే, ఈ అడ్వెంచర్ బైక్ మరింత వాల్యూ ఫర్ మనీగా మారుతోంది.

ఇంజిన్‌, పనితీరు వివరాలు

V-స్ట్రామ్ SXలో 249cc సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 26.5 bhp పవర్, 22.2 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. నగర ప్రయాణాల్లో స్మూత్ రైడింగ్ ఇవ్వడమే కాకుండా, హైవే స్పీడ్స్‌లో కూడా బైక్ స్టేబుల్‌గా అనిపిస్తుంది.

సస్పెన్షన్‌, బ్రేకింగ్‌ సెటప్

ఈ అడ్వెంచర్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 7-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ ఉన్న మోనోషాక్ అందిస్తున్నారు. బ్రేకింగ్ బాధ్యతను ముందు, వెనుక డిస్క్ బ్రేకులు చూసుకుంటాయి. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. ముందు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల అలాయ్ వీల్స్‌పై డ్యూయల్ పర్పస్ ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి.

డిజైన్‌, ఫీచర్లు

డిజైన్ పరంగా, V-స్ట్రామ్ SX తన పెద్ద అన్నయ్య V-స్ట్రామ్ 800DE నుంచి ప్రేరణ పొందింది. బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, ఎత్తుగా ఉన్న విండ్‌స్క్రీన్, సింగిల్ పాడ్ LED హెడ్‌ల్యాంప్‌, మసిల్డ్‌ లుక్ ఫ్యూయల్ ట్యాంక్ బైక్‌కు అడ్వెంచర్ స్పూర్తిని ఇస్తాయి. వెనుక భాగంలో స్టాండర్డ్ లగేజ్ ర్యాక్ కూడా ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కాల్, మెసేజ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ETA, స్పీడ్ అలర్ట్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే USB చార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు.

కొత్త రంగులు

ఇటీవల సుజుకి V-స్ట్రామ్ SXకు నాలుగు కొత్త కలర్ ఆప్షన్లు పరిచయం చేసింది. ఇవి బైక్ లుక్‌ను మరింత ఫ్రెష్‌గా మార్చాయి. కొత్త డీకల్స్‌తో కలిసి ఈ రంగులు అడ్వెంచర్ ఫీల్‌ను పెంచుతున్నాయి.

మొత్తంగా చూస్తే, ఇయర్ ఎండ్ ఆఫర్లతో సుజుకి V-స్ట్రామ్ SX కొనడానికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. అడ్వెంచర్ బైక్ కోసం చూస్తున్న తెలుగు రాష్ట్రాల రైడర్లకు ఈ ఆఫర్లు ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.