SMK Helmets India: భారత మార్కెట్‌లో ప్రీమియం బైక్‌లు, అడ్వెంచర్ టూరింగ్, లాంగ్ రైడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, రైడర్ల భద్రతపై దృష్టి పెట్టిన బ్రాండ్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్ (Studds Accessories Ltd)కు చెందిన ప్రీమియం బ్రాండ్ ఎంఎస్‌కే హెల్మెట్స్ (SMK Helmets)… ఇండియా బైక్ వీక్ 2025 (India Bike Week) వేదికగా తన కొత్త ప్రీమియం ప్రొడక్ట్ రేంజ్‌ను ఆవిష్కరించింది.
ప్రధాన ఆకర్షణ ఇదే...ఈ లాంచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది SMK సైగ్నస్ ఫ్లిప్‌బ్యాక్ హెల్మెట్ (Cygnus flip-back helmet). ఇది 180 డిగ్రీల వరకు తిరిగే చిన్‌బార్‌తో వస్తుంది. అంటే, అవసరాన్ని బట్టి ఫుల్‌ఫేస్ హెల్మెట్‌గా లేదా ఓపెన్‌ఫేస్ హెల్మెట్‌గా వాడుకునే అవకాశం ఉంటుంది. క్రూయిజర్ బైక్‌పై నిటారుగా కూర్చుని రైడ్ చేసేవారికి, స్పోర్ట్స్ బైక్‌పై ముందుకు వంగి రైడ్ చేసేవారికి – ఇద్దరికీ సరిపోయేలా దీనిని డిజైన్ చేశారు.
P/J సర్టిఫికేషన్ భారతదేశంలో చాలా కొన్ని హెల్మెట్లకే ఉన్న "P/J సర్టిఫికేషన్" సైగ్నస్‌కు ఉండటం విశేషం. ఈ హెల్మెట్‌లో.. ఎనర్జీ ఇంపాక్ట్ రెసిస్టెట్ థెర్మోప్లాస్టిక్ (EIRT) షెల్, మల్టీ డెన్సిటీ EPS లైనర్ ఉండటంతో ప్రమాదాల సమయంలో మెరుగైన రక్షణ లభిస్తుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ వైడ్ వైజర్, పిన్‌లాక్ మాక్స్‌విజన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ సన్‌వైజర్, ప్రీమియం వెంటిలేషన్ సిస్టమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.
వేరియంట్లు - ధర సైగ్నస్ హెల్మెట్ నాలుగు రంగుల్లో, ఐదు సాలిడ్ వేరియంట్లలో, రెండు షెల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. XS నుంచి XXXL వరకు సైజ్‌లు ఉంటాయి. పూర్తి స్థాయి మార్కెట్ లాంచ్ తర్వాత, దీని ధర రూ.17,000 నుంచి రూ.20,000 మధ్య ఉండవచ్చు.
మరికొన్ని హెల్మెట్లుఇదే ఈవెంట్‌లో SMK Ares & SMK Nova మోడళ్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ హెల్మెట్లు ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. Ares మోడల్‌లో డిటాచబుల్ సన్‌పీక్, ఇంటర్నల్ సన్‌వైజర్ ఉంటాయి. Nova మోడల్ మాత్రం కళ్లద్దాలు వాడే రైడర్లకు అనువుగా డిజైన్ చేశారు. వీటిలో అల్ట్రా వైడ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉంటుంది. Ares ధర రూ.6,350 నుంచి, Nova ధర రూ.3,900 నుంచి ప్రారంభమవుతుంది.
డెల్టా సిరీస్ ద్వారా SMK డెమీ-జెట్ హెల్మెట్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది. Delta City మోడల్‌ను నగర ప్రయాణికుల కోసం రూపొందించారు. తక్కువ బరువు గల EIRT షెల్, క్లియర్ వైజర్, క్విక్ రిలీజ్ బకిల్, మాయిశ్చర్‌ను తక్కువగా నిల్వ చేసే ఇంటీరియర్ ఇందులో ఉన్నాయి. Delta Tour మోడల్ లాంగ్ డిస్టెన్స్ రైడర్లకు ఉపయోగపడేలా డ్యూయల్ ఎక్స్‌టర్నల్ వైజర్లు, కంఫర్ట్ చీక్ ప్యాడ్స్, బ్లూటూత్ స్పీకర్ పాకెట్లు కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్ల ధర రూ.3,299 నుంచి ప్రారంభమవుతుంది.
కొత్త రైడింగ్ జాకెట్లుహెల్మెట్లతో పాటు యూరోపియన్ CE Level A సర్టిఫికేషన్ పొందిన రైడింగ్ జాకెట్లను కూడా SMK ప్రదర్శించింది. వేసవికి అనువైన Infinity Rush, Gladiator జాకెట్లు... 600D ఆక్స్‌ఫర్డ్ ఫ్యాబ్రిక్, మెష్ ప్యానెల్స్, రిమూవబుల్ వాటర్‌ప్రూఫ్ లైనర్లతో వస్తాయి. టూరింగ్, చలికాలానికి సరిపోయే Apex Adventura జాకెట్.... త్రీ-క్వార్టర్ లెంగ్త్, థర్మల్ లైనర్, రిఫ్లెక్టివ్ ప్యానెల్స్, హైడ్రేషన్ ప్యాక్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంటుంది. మహిళా రైడర్ల కోసం Athenova జాకెట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జాకెట్లు S నుంచి 4XL వరకు సైజ్‌లలో వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్న స్టడ్స్ యాక్సెసరీస్… 2024లో ప్రపంచంలోనే అతి పెద్ద హెల్మెట్ తయారీ కంపెనీగా నిలిచింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.