Chinni Serial Today Episode మధు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నయని అనే కానిస్టేబుల్‌ని కలుస్తుంది. ఆమెతో మా అమ్మ నిజంగా నేరం చేసింది అని మీరు నమ్మారా అని అడుగుతుంది. నలినీ చిన్నితో నేనే కాదు పోలీస్ స్టేషన్‌లో ఎవరూ నమ్మలేదు అని కానీ సాక్ష్యాలు బలంగా ఉండేవని చెప్తుంది.
మధు ఆవిడతో ఆ సాక్ష్యాలు ఏం చూపించాను.. కంప్లైంట్ కాఫీ నాకు ఇచ్చేలా చేయమని అడుగుతుంది. అవన్నీ హైదరాబాద్‌లో ఉంటాయి. అక్కడున్న సూపరిండెంట్ చాలా మంచావిడ ప్రస్తుతం ఆవిడ అమెరికా వెళ్లారు. వచ్చాక ఆవిడతో మాట్లాడుదాం అని అంటుంది. నాగవల్లి ఇంటికి పంతుల్ని పిలిపిస్తుంది. శ్రేయ, మ్యాడీల జాతకాలు ఇచ్చి గురువు గారికి ఇప్పించి మంచి మూహూర్తం పెట్టించమని అంటుంది. శ్రేయ చాలా సంతోషపడుతుంది. మ్యాడీ మాత్రం చాలా బాధ పడతాడు.
మధు మ్యాడీ వాళ్ల ఇంటికి వస్తుంది. మ్యాడీ మధుని నాగవల్లి దగ్గరకు తీసుకెళ్లి నీతో ఏదో మాట్లాడుతుందని అంటాడు. ఏ విషయం గురించి అని అడిగితే అమ్మ గురించి మాట్లాడటానికి వచ్చిందని అంటాడు. ఈ విషయం గురించి మాట్లాడటానికి వచ్చిందంటే ఏదో ప్లాన్‌తో వచ్చిందని నాగవల్లి అనుకుంటుంది. మధు నాగవల్లితో చిన్ని వాళ్ల అమ్మ పార్వతి ఆంటీ ఎలా ఉండేవాళ్లు.. జరిగిన దారుణం ముందు ఎవరు చూశారు. ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. దేవాతో పాటు అందరూ బయటకు వస్తారు. ఈ పిల్ల ఏంటి గతాన్ని తవ్వుతుంది అని దేవా అనుకుంటాడు.
నాగవల్లితో సహా ఎవరూ అప్పుడు లేరు అని తెలియడంతో మీకు ఎవరికీ పార్వతి ఆంటీ ఎలా చనిపోయారో కచ్చితంగా తెలీదన్నమాట అని అంటుంది. ఇంట్లో శుభకార్యం జరగనుంది.. ఇప్పుడు ఆ విషయం అవసరమా.. ఇక దాని గురించి ఎవరూ మాట్లాడొద్దు అని నాగవల్లి అంటుంది. మ్యాడీ శ్రేయల పెళ్లి గురించి నీకు బాగా తెలుసు కదా.. ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడుకున్నాం.. నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కార్యానికి సంబంధించి మాట్లాడాం కదా స్వీట్ తయారు చేసి తీసుకురా.. దీంతో నీ బాధ్యత అయిపోయింది అనుకోకు.. వాళ్ల పదహారు రోజుల పండగ వరకు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటుంది.
మధు సరే అంటుంది. లోహిత తాను కూడా సాయం చేస్తా అని మధుని కిచెన్‌కి తీసుకెళ్తుంది. లోహిత మధుకి ఎక్కడ ఏం ఉన్నాయో చెప్తుంది. మధు స్వీట్ రెడీ చేస్తుంది. లోహిత జీడిపప్పు దాచేస్తుంది. దాంతో మధు లోహితను అడిగితే నాకు తెలీదు అని అనడంతో ప్రమీలను అడగాలని మధు వెళ్తుంది. మధు వెళ్లి వచ్చేలోపు లోహిత స్వీట్‌లో కారం పొడి చల్లేస్తుంది. మధు అందరికీ స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది. మధు అందరికీ స్వీట్ ఇస్తుంది. లోహితకు కూడా ఇస్తుంది. అందరూ స్వీట్ తిని మధు మీద అరుస్తారని తిట్టి పంపేస్తారని అనుకుంటుంది. నాగవల్లి దేవాతో మధుకి నేనే స్వీట్ చేయమని చెప్పానని అంటుంది. అందరూ స్వీట్ తిని చాలా బాగుందని అంటారు.
లోహిత షాక్ అయిపోతుంది. కారం పొడి కలిపా కదా ఇలా అంటున్నారేంటి అని అనుకుంటుంది. లోహిత నోట్లో పెట్టగానే కారం కారం అని కేకలేసి పరుగులు పెడుతుంది. మధు లోహితతో నువ్వు స్వీట్‌లో కారం కలపడం నేను చూశా అని చెప్తుంది. లోహిత షాక్ అయిపోతుంది. మధుతో రాత్రి తల్లిదండ్రులు మాట్లాడి మ్యాడీ అమెరికా వెళ్లిపోయి ఉంటే వాళ్ల తల్లిదండ్రులు ఎంత బాధ పడేవారో అని అనుకుంటారు. కావేరమ్మ మీద పడిన నింద నువ్వు నిరూపించకపోతే మ్యాడీ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అలాగే ఉండిపోతుందని స్వరూప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.