Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ ఇంగ్లీష్ టీచర్ జాబ్ తెచ్చుకోవడానికి ఇంటర్వ్యూకి వెళ్తుందని నర్మద, ప్రేమలు ఇంట్లో అందరికీ పాయసం పంచుతారు. వల్లీ చూసి తల బాదుకుంటుంది. ఉద్యోగానికి వెళ్తే సర్టిఫికేట్ల గురించి తెలిసిపోతుంది. బండారం బయట పడిపోతుందని వల్లీ కంగారు పడుతుంది. ఇంటర్వ్యూ నుంచి ఎలా బయట పడాలి అనుకుంటూ తెగ ఆలోచించి కిచెన్‌లోకి వెళ్లి ఉల్లిపాయ సంకలో పెట్టుకొని జ్వరం వచ్చినట్లు నటిస్తుంది.

Continues below advertisement

నర్మద, ప్రేమలు వల్లీని తీసుకొస్తామని వెళ్లే సరికి వల్లీ కూనిరాగాలు తీస్తుంటుంది. ఏమైందని ప్రేమ అడిగితే జ్వరం వచ్చిందని అంటుంది. రాత్రి బాగున్నావ్.. ఉదయం లేచే సరికి బాగానే ఉన్నావ్ సడెన్‌గా జ్వరం ఏంటి అని అడుగుతారు. ఇద్దరికీ వల్లీ నాటకం ఆడుతుందని అర్థమవుతుంది. ఇంటర్య్యూకి వెళ్దువు పద టైం అయింది అని అంటారు. జ్వరం ఎంత వచ్చిందో చూడండి అయి చేయి ఇస్తే సంక నుంచి ఉల్లిపాయ ముక్క పడుతుంది. ఇద్దరూ వల్లీతో ఇంటర్య్యూకి వెళ్దువులే బాధ పడకు అని చెప్పి ఎవర్ని పిలిపిస్తే నువ్వ ఇంటర్వ్యూకి వెళ్తావో వాళ్లని పిలుస్తామని అంటారు.

భాగ్యం, ఆనంద్రావుల వెంట అప్పుల వాళ్ల పరుగులు పెడతారు. ప్రేమ, నర్మదని కూడా మోసం చేసి పది లక్షలు దక్కించుకున్నాం కానీ వీళ్లు వదలడం లేదని ఊరంతా పరుగులు పెడతారు. ఏం చేయాలా అనుకుంటూ వల్లీకి విషయం చెప్తే విశ్వకి చెప్పి రౌడీలను తరిమేస్తుందని అనుకొని వల్లీకి కాల్ చేస్తారు. ఇద్దరూ వెంటనే వల్లీకి కాల్ చేసి విశ్వ మనుషులు పది లక్షల కోసం తరుముతున్నారని చంపేస్తారని భాగ్యం చెప్తుంది. అయితే చచ్చిపోండి.. ఇక్కడ మీరు ఇచ్చిన ఎంఏ సర్టిఫికేట్ టెన్షన్‌తో నేను పోయేలా ఉన్నానని విషయం చెప్తుంది. మీకు చేతనైతే నాకు ఈ గండం నుంచి గట్టెక్కించండి లేదంటే మీరు వాళ్ల చేతిలో చచ్చిపోండి అని అంటుంది. 

Continues below advertisement

ఇడ్లీ అంటూ రౌడీలు ఇద్దరి వెంట పరుగులు పెడతారు. మనమే కాదు మన అమ్మడు కూడా దొరికిపోయేలా ఉందని కంగారు పడతారు.  నర్మద, ప్రేమలు వల్లీ కోసం ఓ డాక్టర్‌ని తీసుకొస్తారు. ఆయనను చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నేను ట్రీట్మెంట్ చేయాల్సిన పప్పీ ఎక్కడ అని డాక్టర్ అడిగితే అతను ఏంటి కుక్కల డాక్టర్‌లా అలా ప్రవర్తిస్తున్నారు అని అందరూ అడుగుతారు.  అతను చాలా ఫేమస్ అని నర్మద, ప్రేమలు చెప్తారు.

నర్మద, ప్రేమలు ఆ డాక్టర్‌ని వల్లీ దగ్గరకు తీసుకెళ్తారు. ఆయన వల్లీ దగ్గరకు వెళ్లి కుక్కల వాసన చూసినట్లు.. చూస్తూ భౌ.. భౌ అని అరుస్తూ వల్లీని కంగారు పెట్టేస్తారు. నర్మద, ప్రేమలు నవ్వుకుంటారు. కుక్కల డాక్టర్‌ని తీసుకొచ్చారా ఏంటి అని వల్లీ అడుగుతుంది. వల్లీకి వేయాలి అని పెద్ద ఇంజక్షన్ తీయడంతో వల్లీ అది చూసి బిత్తరపోతుంది. ఇంజక్షన్ వద్దు మందులు ఇవ్వండి అని గోల గోల చేస్తుంది. చిన్న పప్పీకి కూడా పెద్ద ఇంజక్షన్ చేయాలి అని ఆయన అంటూ కళ్లు మూసుకొని ఇంజక్షన్ వేయాలని చూస్తే వల్లీ పరుగులు పెడుతుంది.

నర్మద, ప్రేమలు వల్లీని పట్టుకొని ఇంజక్షన్ చేయమని అంటారు. చివరకు జ్వరం ఏం లేదని జ్వరం తగ్గిపోయిందని అంటుంది. అతను ఒరిజినల్ డాక్టర్ కాదని నీ తిక్క కుదర్చడానికే ఇలా చేశామని నర్మద, ప్రేమలు అనడంతో వల్లీ ఏడుస్తుంది. ఇంటర్వ్యూకి పద టైం అయిందని వల్లీకి ప్రేమ, నర్మద  చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.