Skoda Electric SUV: స్కోడా ఆటో ఎలక్ట్రిఫికేషన్ వైపు దూసుకుపోతోంది. భారతదేశంలో తయారు అయిన సరసమైన ఈవీని కలిగి ఉన్న తన భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. భారతీయ మార్కెట్లో విజయవంతం కావడానికి లోకలైజేషన్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉందని, స్కోడా భారతీయ మార్కెట్ కోసం సరసమైన ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని యోచిస్తోంది. దీన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. కారు సైజు, ధర గురించి పెద్దగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఇది కుషాక్ ఆధారంగా ఉంటుందని, దీని ధర రూ. 20 లక్షల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.


స్కోడా దాని రాబోయే ఎలక్ట్రిక్ మోడల్‌లో గ్లోబల్ ఎంఈబీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని మన మార్కెట్ కోసం లోకలైజ్ కూడా చేయవచ్చు. దీనిని ఫ్రంట్ వీల్ డ్రైవ్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించి నిర్మించే అవకాశం ఉంది. ఇందులో మహీంద్రా కూడా పాత్రను కలిగి ఉండవచ్చు. మహీంద్రా ఇప్పటికే స్కోడా మాతృ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌తో దాని ఇంగ్లో ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ కోసం ఎంఈబీ భాగాలను సోర్స్ చేయడానికి ఒక ఒప్పందాన్ని కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ, రాబోయే ఈవీకి కుషాక్ ఆధారం కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇది ఒక చిన్న సబ్-4 మీటర్ల SUV కావచ్చు. దీన్ని భారతీయ మార్కెట్‌కు తీసుకురావడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు.


ఎప్పుడు లాంచ్ చేస్తారు?
ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం ఎటువంటి లాంచ్ టైమ్‌లైన్ ఫిక్స్ చేయలేదు. అయితే ఈ కొత్త చవకైన ఈవీ వచ్చే రెండు మూడు సంవత్సరాలలో భారతదేశానికి రానుంది. అయితే దీనికి ముందు ఈ మోడల్ ఐసీఈ వెర్షన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


వేటితో పోటీ?
లాంచ్ అయిన తర్వాత స్కోడా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నేరుగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400తో పోటీపడుతుంది. నెక్సాన్ ఈవీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 465 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇటీవల టాటా మోటార్స్ కూడా దీని ధరను రూ. 1.2 లక్షల భారీ డిస్కౌంట్ అందించింది.


మరోవైపు మారుతి సుజుకి ఇటీవల అరేనా, నెక్సా సిరీస్‌ల డీలర్‌షిప్‌లలో తన కార్ల ధరలను మార్చింది. అప్‌డేట్ చేసిన ధరల గురించిన సమాచారం కూడా బయటకు వచ్చింది. డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ సహా మారుతి గ్రాండ్ విటారా ఎంపిక చేసిన వేరియంట్‌ల ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. అన్ని ఇతర వేరియంట్‌లు అన్నీ రూ.10,000 వరకు పెరిగాయి. గ్రాండ్ విటారా మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్‌లకు పోటీగా ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 10.80 లక్షల నుంచి రూ. 20.09 లక్షల మధ్యలో ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 10 రంగులు, రెండు ఇంజన్ ఆప్షన్లు, నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!