Skoda Kylaq SUV vs Tata Nexon: స్కోడా ఇటీవల భారత మార్కెట్లో అత్యంత చవకైన ఎస్‌యూవీ స్కోడా కైలాక్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో డైరెక్ట్‌గా పోటీపడుతుంది. ఈ రెండు కార్లలో ఏది ఎంచుకుంటే బాగుంటుందో తెలియక జనాలు తికమకపడుతున్నారు. ఇక్కడ ఈ రెండు కార్ల ఫీచర్లు, ధర, ఇంజిన్ గురించి కంపేర్ చేద్దాం. తద్వారా మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అని మీరే నిర్ణయించుకోవచ్చు.


ధర విషయంలో ఏది బెస్ట్?
స్కోడా కైలాక్ ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.7.89 లక్షలుగా ఉంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీ బుకింగ్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కోడా కారు డెలివరీ జనవరి 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ గురించి చెప్పాలంటే దీని ధర రూ. 8.5 లక్షల నుంచి మొదలై రూ. 15 లక్షల వరకు ఉంటుంది.


దేని ఫీచర్లు బాగున్నాయి?
స్కోడా కైలాక్ ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎక్స్, దిగువన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హ్యాండ్‌ల్యాంప్‌తో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. దీంతో పాటు వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార టెయిల్ ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ గురించి చెప్పాలంటే ఇందులో ఆకర్షణీయమైన గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వై-ఆకారపు ఎల్ఈడీ టైల్‌లైట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.



Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!


ఇంజిన్ ఎలా ఉంది?
స్కోడా కైలాక్ 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. స్కోడా కారు ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తుంది. టాటా నెక్సాన్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.


సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే స్కోడా కైలాక్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్సీ, హిల్ హోల్డ్ అసిస్ట్, సెన్సార్‌లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.


టాటా నెక్సాన్ గురించి చెప్పాలంటే ఇది బీఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా ఏడీఏఎస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.


ప్రస్తుతం మనదేశంలో ఎస్‌యూవీల విభాగంలో మంచి పోటీ నెలకొంది. బడ్జెట్ ధరలో కూాడా ఎస్‌యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాటా పంచ్ అయితే ఎస్‌యూవీ సేల్స్‌లో దూసుకుపోతుంది. ఇటీవలే హ్యుందాయ్ క్రెటా సేల్స్ కూడా పెరిగాయి.



Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?