Amaran OTT Release: తమిళ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘అమరన్’. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తొలి షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. వసూళ్ల పరంగా రూ. 200 కోట్ల మార్క్ ను దాటేసిన ‘అమరన్’, రూ. 250 కోట్లకు చేరువైంది. ఊహించిన దాని కంటే అద్భుత విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం సంతోషంలో మునిగిపోయింది. “హిట్ అవుతుందనుకున్నాం. కానీ, ఈ స్థాయి సక్సెస్ అవుతుందని ఊహించలేదు” అని మేకర్స్ చెప్పడం విశేషం.
‘అమరన్’ ఓటీటీ విడుదల మరింత ఆలస్యం
‘అమరన్’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. అంటే, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లేదంటే సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని భావించింది. కానీ, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తన రిలీజ్ ప్లాన్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో విడుదలను మరో రెండు వారాలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే, ‘అమరన్‘ సినిమా డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
‘మేజర్‘ లాగే ‘అమరన్‘, కానీ..
అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్‘ లాంటి కథతోనే ‘అమరన్‘ సినిమాను తెరకెక్కించారు. రెండు సినిమాలూ నిజ జీవితాల స్ఫూర్తితో, దేశ రక్షణలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగం చేసిన సైనికుల వీరోచిత గాథలను చెప్పినవే. అయితే, ఈ సినిమా కథ చెప్పే విధానం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య కథ చెప్పడం ఆసక్తిని కలిగిసున్నది. ఈ సినిమాలో ముకుంద్ భార్యగా సాయి పల్లవి నటించింది. ఎప్పటి లాగే ఈ చిత్రంలో తన అద్భుతమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించింది. సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది.
మేజర్ ముకుంద్ జీవిత కథ ఆధారంగా..
‘అమరన్’ సినిమాను ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించారు. దీపావళికి ఎలాంటి హడావుడి లేకుండా రిలీజై చక్కటి హిట్ అందుకుంది. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో సూర్య 'కంగువ' చిత్రానికి తలనొప్పిగా మారింది. ఆయనకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరుకుతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
Read Also: ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’- దుమ్మురేపుతున్న టామ్ క్రూజ్ టీజర్ ట్రైలర్!