Skoda Kodiaq 2026 SUV Launched in India with ADAS: స్కోడా ఆటో ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కోడియాక్ ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చింది. లగ్జరీ, కంఫర్ట్ కోరుకునే వారి కోసం ఈ కారును డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈసారి ఫీచర్ల విషయంలో స్కోడా ఎక్కడా రాజీ పడలేదు. 2026 స్కోడా కోడియాక్ మూడు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్లకు తమ బడ్జెట్ కు తగ్గట్టుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Continues below advertisement

ఇంజిన్ ,పెర్ఫార్మెన్స్..2026 స్కోడా కోడియాక్ పాత మోడల్ లో ఉన్న పవర్ ఫుల్ ఇంజిన్ తోనే వస్తోంది. ఇందులో 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, టర్బో-పెట్రోల్ యూనిట్ అమర్చారు. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జత చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 204 హెచ్‌పి పవర్ ను, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ రోడ్లపైనే కాకుండా హైవేలపై కూడా ఈ కారు అదిరిపోయే స్పీడ్ తో దూసుకుపోతుంది. స్మూత్ గేర్ షిఫ్టింగ్ కోసం స్టీరింగ్ వీల్ వెనుక షిఫ్ట్ ప్యాడిల్స్ కూడా ఇచ్చారు.

ఇంటీరియర్ ,లగ్జరీ ఫీచర్లు..కారు లోపలి భాగం ఇప్పుడు మరింత రిచ్ గా మారింది. లౌంజ్ వేరియంట్ లో గ్రే సూడియా ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ వాడారు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్రానిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. గేర్ సెలెక్టర్‌ను స్టీరింగ్ కాలమ్ పైకి మార్చడం వల్ల సెంటర్ కన్సోల్ వద్ద ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఇక హై-ఎండ్ వేరియంట్ అయిన 'సెలెక్షన్ ఎల్ అండ్ కే' లో కాగ్నాక్ లెదర్ అప్హోల్స్టరీ ఉంది. దీని ముందు సీట్లలో న్యూమాటిక్ మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ వంటి సౌకర్యాలు ఉండటం విశేషం.

Continues below advertisement

అత్యాధునిక టెక్నాలజీ - అడాస్:ఈసారి కోడియాక్ లో అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే అడాస్ (Advanced Driver Assistance Systems) ఫీచర్లు. స్పోర్ట్‌లైన్ మోడల్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, సైడ్ అసిస్ట్ (బ్లైండ్ స్పాట్ డిటెక్షన్), రేర్ ట్రాఫిక్ అలర్ట్, ఎగ్జిట్ వార్నింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్ లైట్లు రాత్రి వేళల్లో రోడ్డును స్పష్టంగా చూడటానికి సహాయపడతాయి. 360-డిగ్రీ కెమెరా, ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను అప్‌గ్రేడ్ చేశారు, దీనివల్ల స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది.

వేరియంట్లు ధరల పట్టిక:కొత్త స్కోడా కోడియాక్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద ఈ విధంగా ఉన్నాయి.

స్కోడా కోడియాక్ లౌంజ్: రూ. 36.99 లక్షలు

స్కోడా కోడియాక్ స్పోర్ట్‌లైన్: రూ. 44.99 లక్షలు

స్కోడా కోడియాక్ సెలెక్షన్ ఎల్ అండ్ కే: రూ. 46.99 లక్షలు

ధరకు తగ్గట్టే ఈ కారులో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీని తట్టుకునేలా స్కోడా ఈ మార్పులు చేసింది. సేఫ్టీ, పవర్, స్టైల్ కలగలిసిన ఈ కారు ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వెళ్లడానికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. స్కోడా తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే టెక్నాలజీ పరంగా ముందడుగు వేసింది. ఈ కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.