Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ గతం మర్చిపోయాడని నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో డాక్టర్‌ చెప్పగానే.. భాగీ, రాథోడ్‌, పిల్లలు షాక్‌ అవుతారు. మనోహరి మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే తన రూంలోకి వెళ్లి సంతోషంగా పాటలు పెట్టుకుని డాన్స్‌ చేస్తుంది. చంభా కోపంగా చూస్తుంది.

చంభా: ఆపు మనోహరి ఏంటా పిచ్చి గంతులు..

మనోహరి: ఇవి పిచ్చి గంతులు కావు చెప్పలేనంత సంతోషం, పట్టరాని ఆనందం.. నాకు చాలా థ్రిల్లింగ్‌ గా ఉంది.  గాలిలో తేలుతున్నట్టుగా ఉంది.

చంభా: అమరేంద్ర సార్‌ గతం మర్చిపోయారని అక్కడ అందరూ శోఖసముద్రంలో మునిగి తేలుతుంటే.. నువ్వు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నావా..?

మనోహరి: అమర్‌ గతం మర్చిపోవడం వాళ్లకు మైనస్‌ అయితే నాకు ప్లస్‌ కదా

చంభా: అంతేలే సార్‌ కళ్లు తెరవగానే.. నీ అంతు తేలుస్తారు అనుకున్నాను. కానీ నీ అదృష్టం బాగుంది

మనోహరి: అదృష్టం బాగుండటం కాదు చంభా బ్రహ్మండంగా ఉంది. నా పని అయిపోయింది. నేను ఓడిపోతాను అనుకున్న ప్రతిసారి చివరి క్షణంలో నేను గెలుస్తూనే వస్తున్నాను. దేవుడున్నాడు చంభా నా పక్కనే ఉన్నాడు. ప్రతిసారి నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అందుకే అరుంధతిని చంపినప్పుడు దొరకలేదు.. భాగీని ఈ ఇంటి నుంచి పంపినప్పుడు దొరకలేదు.. ఆఖరికి నేను ఎంతగానో ప్రేమిస్తున్న అమరేంద్రను చంపాలనుకున్నప్పుడు కూడా దొరకలేదు. ఓటమి అంచుదాకా వెళ్లి నేను గెలుస్తున్నాను..

చంభా: నువ్వు గెలువలేదు మనోహరి తప్పించుకుంటున్నావు అంతే.. అమర్‌ సార్‌ ఇంకా భాగీ వైపే ఉన్నారు. ఎందుకంటే సార్‌ నీకు సొంతం అవ్వలేదు.

మనోహరి: అది ఇంక ఎంతో దూరంలో లేదు చంభా ఎందుకంటే అమర్‌ ఇక చచ్చి బతికాడు. కానీ ఈ కొత్త జన్మ నాకోసమే.. నా కోసమే అమర్‌ కొత్త జన్మ ఎత్తాడు

చంభా: సార్‌ గతం మర్చిపోయారు. ఆ గతం ఎప్పుడైనా గుర్తు రావొచ్చు అని డాక్టర్‌ చెప్పారు కదా..?

మనోహరి: ఎప్పటికైనా గుర్తుకు రాకపోవచ్చని కూడా డాక్టర్‌ చెప్పారు. అమర్‌కు తన పేరు కూడా గుర్తు లేదు. ఇక నేను అరుంధతిని చంపానని.. రణవీర్‌ భార్యనని నేను చేసిన ఎన్నో తప్పులతో సహా అమర్‌కు ఏదీ గుర్తు లేదు. అమర్‌ ఇప్పుడొక వైట్‌ పేపర్‌. ఆ పేపర్ మీద నా పేరు రాసుకుంటాను. అమర్‌ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేసుకుంటాను. చంభా నా కల నెరవేరబోతుంది

చంభా: నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ భాగీ, రాథోడ్‌ చూస్తూ ఊరుకుంటారా..?

మనోహరి: చూస్తూ ఊరుకోక ఏం చేస్తారు. అమర్‌కు ఇప్పుడు ఆ అరుంధతియే గుర్తు లేదు. ఈ భాగీ, దాని కూతురు, పిల్లలు ఆ రాథోడ్‌ ఏం గుర్తు ఉంటారు

చంభా: ఒకవేళ వాళ్లు గుర్తు చేస్తే

మనోహరి: వాళ్ల కంటే ముందు అమర్‌ దగ్గరకు నేనే వెళ్తాను. నా గురించి నాకు అనుకూలంగా నేను చెప్పేసుకుంటాను. నా పక్కనున్న దేవుడు నాకు ఈ సెకండ్‌ చాన్స్‌ ఇచ్చాడు. నాకు ఈ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చాడు.

చంభా: ప్రతిసారి దేవుడు నీ పక్కనే ఉన్నాడు అనకు మనోహరి. నీ పక్కనే ఉన్నది. నీ మాజీ భర్త రణవీర్‌. దెయ్యంలా వెంట తిరిగే ఆ ఘోరా, క్షుద్రపూజలు చేసే నేను మా వల్లే నువ్వు ఇక్కడి దాకా వచ్చావు

మనోహరి: మీరు నాకు సాయం మాత్రమే చేశారు. కానీ ఆ దేవుడు నేను ఊహించని వరమే ఇచ్చాడు. ఇక నుంచి చూడు చంభా అమర్‌ను నా వైపు తిప్పుకుని భాగీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. రాథోడ్‌ను రాచి రంపాన పెడతాను. పిల్లలను చిత్రవధ చేస్తాను. అమర్‌ను ఈ ఇంటిని ఆస్థిని నా సొంతం చేసుకుని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్న జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాను

చంభా: దేవుడా మనోహరి వల్ల ఇప్పటికే ఈ ఇల్లు అల్లకల్లోలం అయింది. సార్‌ పరిస్థితి అడ్డం పెట్టుకుని మనోహరి ఇంకెంత అల్లకల్లొలం సృష్టిస్తుందో ఇంకెన్ని నేరాలు ఘోరాలు చేస్తుందో.. తలుచుకుంటేనే భయంగా ఉంది

అనుకుంటూ భయపడుతుంది చంభా. మరోవైపు హాల్లో కూర్చున్న పిల్లలు, భాగీ బాధపడుతుంటారు. అమర్‌ విషయంలో ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటారు. రాథోడ్ కూడా ఇప్పుడు ఏం చేద్దాం మిస్సమ్మ అని అడగ్గానే.. భాగీ మౌనంగా ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మనసులో తలుచుకుని బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!