Skoda India Recall News: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా తన లగ్జరీ ఎస్‌యూవీ కొడియాక్ (Kodiaq) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ సీటు లోపలి ఫ్రేమ్‌లో లోపం ఉన్నట్లు గుర్తించడంతో కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 10 నుండి డిసెంబర్ 8 మధ్య తయారైన సుమారు 221 యూనిట్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. సీటు ఫ్రేమ్ అంచులలో ఉన్న లోపం వల్ల ప్రమాద సమయంలో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ (Side Airbags) సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు గాయాలయ్యే ముప్పు ఉందని స్కోడా హెచ్చరించింది.
SIAM వివరణఎస్‌ఐఏఎం (SIAM) వెబ్‌సైట్‌లో ఈ లోపం గురించి వివరంగా కంపెనీ ప్రతినిథులు పేర్కొన్నారు. పైన తెలిపిన కాలంలో తయారైన వాహనాలలో ఫ్రంట్ సీటు లోపలి భాగం అంచులు సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకునేటప్పుడు ఆశించిన స్థాయిలో రక్షణ కల్పించలేకపోవచ్చు. ఎయిర్‌బ్యాగ్ ప్రభావం తగ్గడం వల్ల ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ వాహనాలను తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేయాలని స్కోడా నిర్ణయించింది.
కొడియాక్ ఎస్‌యూవీ విశేషాలుస్కోడా తన సెకండ్ జనరేషన్ కొడియాక్ ఎస్‌యూవీని గతేడాది ఏప్రిల్‌లో ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో 2.0 టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ప్రారంభంలో దీనిని మూడు వరుసల సీటింగ్ (7-seater) తో స్పోర్ట్‌లైన్, సెలక్షన్ ఎల్&కె వంటి వేరియంట్లలో తెచ్చారు. ఆ తర్వాత రెండు వరుసల సీటింగ్ (5-seater) కలిగిన 'లాంజ్' ట్రిమ్‌ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
Also Read: Auto News: మీ కార్ టైర్లలో గాలి తక్కువగా ఉందా? జాగ్రత్త.. మైలేజీతో పాటు సేఫ్టీ కూడా దెబ్బతినొచ్చు!
ధర, పోటీ వివరాలుప్రస్తుతం కొడియాక్ ధర రూ. 39.99 లక్షల నుండి రూ. 45.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. లగ్జరీ విభాగంలో ఇది తన సిస్టర్ మోడల్ అయిన కొత్త వోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) తో పోటీ పడుతోంది. తమ కారు రీకాల్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవడానికి వినియోగదారులు స్కోడా సర్వీస్ సెంటర్లను సంప్రదించవచ్చు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే స్కోడా, లోపాలను గుర్తించిన వెంటనే స్పందించి ప్రయాణికుల క్షేమం కోరడం ప్రశంసనీయం.
