Top Selling Bikes: భారతదేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అయితే 2023 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో మోటార్‌సైకిల్ విక్రయాలు 14.06 శాతం పెరిగి 84,26,714 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 73,87,645 యూనిట్లు అమ్ముడుపోయాయి.


మొదటి స్థానంలో హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్ప్లెండర్ అమ్మకాలతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. స్ప్లెండర్ అమ్మకాలు 2023లో 32,55,744 యూనిట్లకు పెరిగాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడుపోయిన 26,65,386 యూనిట్ల కంటే 22.15 శాతం ఎక్కువ. ఈ బైక్ మొత్తం మార్కెట్ వాటా 38.64 శాతంగా ఉంది.


అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 మోటార్‌సైకిళ్లలో హోండా సీబీ షైన్ 12,09,025 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడు పోయిన 11,01,684 యూనిట్ల కంటే 9.74 శాతం ఎక్కువ. 


హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ విక్రయాలు 9.71 శాతం తగ్గి 10,52,043 యూనిట్లకు చేరాయి. ఇది అంతకుముందు సంవత్సరంలో 11,65,163 యూనిట్లు అమ్ముడు పోయింది. HF డీలక్స్ మార్కెట్ వాటా 12.48 శాతంగా ఉంది. బజాజ్ పల్సర్ సిరీస్ విక్రయాలు 32.43 శాతం పెరిగి 10,29,057 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 2,52,013 యూనిట్లు ఎక్కువ.


తగ్గిన బజాజ్ ప్లాటినా అమ్మకాలు
బజాజ్ ప్లాటినా, గత ఆర్థిక సంవత్సరంలో 5,34,017 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. 2022 ఆర్థిక సంవత్సరంలో 5,75,847 యూనిట్లతో పోలిస్తే ఇది 7.26 శాతం తక్కువ. TVS అపాచీ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సమయంలో ఇది 3,49,878 యూనిట్లను విక్రయించింది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డు
2023 ఆర్థిక సంవత్సరంలో 8,34,895 యూనిట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అతిపెద్ద విక్రయాలను నమోదు చేసింది. ఈ టైమ్ పీరియడ్‌లో క్లాసిక్ 350కి సంబంధించి 3,14,982 యూనిట్లు విక్రయించబడ్డాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో హీరో గ్లామర్ అమ్మకాలు 11.70 శాతం తగ్గి 2,49,878 యూనిట్లకు పడిపోయాయి.


టీవీఎస్ రైడర్ బాగా అమ్ముడుపోయింది
గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ రైడర్ అమ్మకాలు 211.94 శాతం పెరిగి 76,742 యూనిట్లను చేరుకున్నాయి. యమహా ఎఫ్‌జెడ్ 29.36 శాతం వృద్ధితో 1,93,498 యూనిట్లను విక్రయించి పదో స్థానంలో నిలిచింది.


దిగ్గజ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది ప్రారంభంలో తన మెటోర్ 650 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఎలక్ట్రిక్ 01'ను 2024లో విడుదల చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650 త్వరలో లాంచ్ కానుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డిస్‌ప్లేలో చూడటానికి ఇంటర్‌సెప్టర్ 650ని పోలి ఉంటుంది. అయితే ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మాదిరిగానే కొన్ని ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్, రియర్ వ్యూ మిర్రర్, టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్స్ టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. దానికి స్పోర్టీ లుక్ కూడా ఉంది. 648 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఇందులో ఇవ్వవచ్చు, ఇది 47.6 పీఎస్ పవర్ ఇవ్వగలదు. ఈ బైక్‌ను 2024లో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర దాదాపు 3.5 లక్షల రూపాయలు ఉండవచ్చు.