Second Gen Kia Seltos 2026: సెకండ్‌ జెనరేషన్‌ కియా సెల్టోస్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌. కియా తాజాగా బయటకు తెచ్చిన టీజర్లు, ఇంటీరియర్‌ స్పై ఇమేజెస్‌ చూసేసరికి, ఈ SUV ఈసారి యువతను బాగా ఆకట్టుకునేలా వస్తుందని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ రోజు (2025 డిసెంబర్‌ 10) గ్లోబల్‌గా డెబ్యూ కానున్న ఈ మోడల్‌, ఇండియాలో 2026 మొదటి భాగంలో రోడ్డెక్కే ఛాన్స్‌ ఉంది.

Continues below advertisement

న్యూ డిజైన్‌ – మోర్‌ షార్ప్‌, మోర్‌ స్పోర్టీటీజర్‌ను బట్టి.. కొత్త సెల్టోస్‌ ముందు భాగాన “టైగర్‌ ఫేస్‌ గ్రిల్‌” భారీగా, గ్లోస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌తో మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. వెర్టికల్‌ LED DRLs ఈ SUV ని రోడ్డుపై వెంటనే గుర్తుపట్టేలా చేస్తాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌, కింక్‌ ఉన్న విండో లైన్‌, బాడీ క్లాడింగ్‌ SUV తరహా సెటప్‌ను ఇస్తాయి.

వెనుక భాగం మాత్రం పూర్తిగా రీఫ్రెష్‌ అయింది. కియా క్యారెన్స్‌ క్లావిస్‌ ఇన్‌స్పిరేషన్‌తో కొత్త టూ-పీస్‌ LED లైట్‌బార్‌ టెయిల్‌గేట్‌ మీద రిచ్‌గా కనిపిస్తోంది. బంపర్‌ మీద బ్లాక్‌ క్లాడింగ్‌, సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌ ఈ SUV లుక్‌ను ఇంకా స్టైలిష్‌గా చేస్తున్నాయి.

Continues below advertisement

ఇంటీరియర్‌ – పక్కా మోడర్న్‌, పక్కా ప్రీమియంఇంటీరియర్‌ విషయంలో కొత్త సెల్టోస్‌ కొత్త స్టెప్‌ వేసింది. కొత్త 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ సెంటర్‌ డ్యాష్‌పై వెడల్పుగా కనిపిస్తుంది. స్లిమ్‌ AC వెంట్స్‌, సైరోస్‌ నుంచి తీసుకున్న స్విచ్‌గేర్‌, ఆల్-న్యూ 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, డోర్‌ ప్యాడ్స్‌పై అంబియెంట్‌ లైటింగ్‌ - కియా ఈసారి క్వాలిటీపై ఎంత ఫోకస్‌ పెట్టిందో ఇవన్నీ చెప్పేస్తాయి.

పానోరమిక్‌ సన్‌రూఫ్‌, LED వెల్‌కమ్‌ యానిమేషన్స్‌ కూడా స్టాండ్‌ఔట్‌ ఫీచర్లే. కంఫర్ట్‌ విషయంలో... వెంటిలేటెడ్‌ సీట్లు, వైర్‌లెస్‌ చార్జర్‌, పవర్డ్‌ ఫ్రంట్‌ సీట్లు, బాస్‌ మోడ్‌ వంటి హై-ఎండ్‌ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇంజిన్‌ ఆప్షన్లు – కొత్త హైబ్రిడ్‌ స్పెషల్‌ఈసారి Seltosలో అసలు హైలైట్‌... కొత్త నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ (NA) హైబ్రిడ్‌ ఇంజిన్‌. ఇది కియా ఇండియా హైబ్రిడ్‌ లైనప్‌లో పెద్ద అడుగు. 1.5 లీటర్‌ NA ఇంజిన్‌ను ఆధారంగా తీసుకుని ఎలక్ట్రిఫైడ్‌ వెర్షన్‌ ఇవ్వనున్నారు. ప్రస్తుతం 115hp, 144Nm ఇస్తున్న ఈ ఇంజిన్, హైబ్రిడ్‌ అయ్యాక మరింత ఎఫిషియెన్సీ ఇచ్చే అవకాశం ఉంది.

అలాగే 1.5-లీటర్‌ టర్బో పెట్రోల్‌ (160hp) & 1.5-లీటర్‌ డీజిల్‌ (116hp) ఇంజిన్‌లు కూడా కొనసాగుతాయి.

సేఫ్టీ – మాక్స్ ప్రొటెక్షన్‌6 ఎయిర్‌బ్యాగ్స్‌, 360° కెమెరా, EPB ఆటో-హోల్డ్‌, TPMS, లెవల్‌-2 ADAS వంటివన్నీ ఈసారి స్ట్రాంగ్‌ పాయింట్స్‌. యువ డ్రైవర్స్‌ కూడా ఇది విషయంలో ఫుల్‌ శాటిస్ఫై అవుతారు.

ధరలు – హైదరాబాద్‌ & విజయవాడకొత్త సెల్టోస్‌ ధరలు ₹11.25 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ నుంచి స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో కూడా ఇదే ఎక్స్‌-షోరూమ్‌ రేట్లు అమల్లోకి రావచ్చు.

మొత్తానికి, కొత్త సెల్టోస్‌ రూపంలో కియా మళ్లీ మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో స్ట్రాంగ్‌ హిట్‌ కొట్టడానికి రెడీ అయినట్లు కనిపిస్తోంది. New Kia Seltos 2026 లుక్స్‌, టెక్‌, కంఫర్ట్‌, హైబ్రిడ్‌ అన్నీ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.