Podharillu Serial Today Episode: రోడ్డుమీద మహి, కిరణ్‌ను చూసిన ప్రతాప్‌ వాళ్ల బైక్‌ను ఫాలో అవుతూ వస్తాడు. ఉదయం తాను రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తున్నానని డ్రాప్‌ చేస్తానని చెబితే మహి వద్దులే నా ప్రెండ్‌ జ్యోతి డ్రాప్‌ చేస్తుందని చెప్పిన అబద్ధం ప్రతాప్‌కు గుర్తుకు వస్తుంది. ఓ సందులోకి వెళ్లిన తర్వాత వాళ్లిద్దరూ మాయమవుతారు. దీంతో చలపతి చెప్పిన మాటలు  ప్రతాప్‌ చెవిలో మారుమోగుతుంటాయి. నా ప్రెండ్‌ చెప్పినట్లే  మహి కూడా నాకు అబద్ధాలు చెప్పి ఎవరితోనో తిరుగుతోందా  అని అనుకుంటాడు.. 

Continues below advertisement

           రాత్రి అయ్యేసరికి అన్నదమ్ములు శాంతిస్తారు. మాధవ్‌ తమ్ముడు కేశవ్‌పై కోప్పడతాడు. ఎవరిమీదో ఉన్న కోపం ఇంట్లో చూపించడమేంటని  చక్రికూడా నిలదీస్తాడు. ఇప్పటికే  మనకు బంధువులు, స్నేహితులు అందరూ దూరమయ్యారని...ఇప్పుడు మనలో మనం కూడా తన్నుకుని దూరమవుదామా అని పెద్దన్నయ్య మాధవ్‌ కేశ‌వ్‌ను నిలదీస్తాడు. ఊళ్లో ఎందుకు పనికి రాని వాళ్లు కూడా మన ఇంటి గురించి తక్కు చేసి మాట్లాడుతున్నారని కేశవ్ బాధపడిపోతాడు. మన పెద్దనాన్న  కూడా మనకు పెళ్లిళ్లు కావని హేళన చేస్తున్నారంటాడు. కోర్టు కేసు వల్ల మనం ఇంటిని కూడా మనం రిపేర్‌ చేయించుకోలేకపోతున్నామంటాడు. చిన్న తమ్ముడు కన్నా కూడా చాలా బాధపడుతుంటాడు.ఇంట్లోనుంచి ఎటైనా పారిపోవాలని అనిపిస్తుందంటాడు. దీంతో మాధవ్‌ అతనికి ధైర్యం చెబుతాడు. ఈఇంటిని బాగుచేయడానికి ఖచ్చితంగా ఓ అమ్మ వస్తుందని అభయమిస్తాడు.

           తన ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్‌ను  కార్పొరేట్ సంస్థ వాళ్లకు నచ్చిందని ఇంట్లో వదినతో చెప్పి మహా ఎంతో సంతోషపడుతుంది.ఆమె ఇప్పటికైనా మీ నాన్నకు విషయం చెబుదామా అంటే....లేదు వాళ్లు ప్రాజెక్ట్‌ ఓకే చేసిన వెంటనే  నాన్నకే మొదట చెబుదామంటుంది. అప్పుడే ప్రతాప్‌ ఇంటికి వచ్చి మహా సంతోషంగా  ఉండటాన్ని చూస్తాడు.  అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. అప్పుడు తండ్రి మహాను ప్రశ్నిస్తాడు.మార్నింగ్ నువ్వు సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి  వెళ్తున్నాను అన్నావు కదా..తెచ్చుకున్నావా అని అడుగుతాడు. కాలేజీ క్లర్క్‌  లేడని...తర్వాత రమ్మని చెప్పారని మళ్లీ అబద్ధం చెబుతుంది. ఇంటికి  ఎలా వచ్చావమ్మాఅని అడగ్గా..జ్యోతి స్కూటీపై వచ్చానని అంటుంది.  నా కూతురు కూడా  ఇంత తేలిగ్గా అబద్ధాలు చెబుతుందా అని ప్రతాప్‌ బాధపడతాడు. ఇక లాభం లేదనుకుని తనకు పెళ్లి చేసేయ్యాలని భావిస్తాడు. వెంటనే పెళ్లి సంబంధాలు చూసే అతనికి ఫోన్ చేసి మాట్లాడతాడు. రేపు పెళ్లిచూపులకు ఏర్పాట్లు చేయమని కోరతాడు. పొద్దునేమో ఇప్పుడే  సంబంధాలు చూడటం ఎందుకని అన్నారు...ఇప్పుడేమో పెళ్లి చూపులకు రమ్మంటున్నారు. ఇంతలో మీ నిర్ణయం ఎందుకు మారిందని భార్య లలిత అడుగుతుంది. దీనికి ప్రతాప్‌ భయం అని సమాధానమిస్తాడు. మహా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టిందని....సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి చెప్పి స్నేహితుడితో  బండిపై వెళ్లడం చూశానని భార్యకు చెబుతాడు. అంటే మీరు దాన్ని అనుమానిస్తున్నారా  అని నిలదీస్తుంది. లేదు  ఆ అబ్బాయి గురించి ఆల్రెడీ  ఎంక్వయిరీ చేశానని...వాళ్లిద్దరూ కేవలం ప్రెండ్స్‌ మాత్రమేనని చెబుతాడు. అయితే మీ భయం ఎందుకని భార్య అడుగుతుంది. చలపతి కూతురు  ప్రేమంచిన  వాడితో లేచిపోయిందని... ఈ వయసులో ఆడపిల్లలను నమ్మలేమని ఇవాళే అర్థమైందని అంటాడు. మన అమ్మాయిని తప్పుబట్టడం లేదని...కానీ ఆ వయసు అలాంటిదని అంటాడు. పొరపాటున తప్పటడుగు పడితే  పరువుపోయి తలెత్తుకోలేమంటాడు. అందుకే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలంటాడు. దీనికి భార్య లలిత కూడా సపోర్ట్ చేస్తుంది.

Continues below advertisement

                   మాధవ్‌ తమ్ముళ్లందరినీ అన్నానికి పిలుస్తాడు. అప్పుడు తండ్రి నారాయణ కూడా వచ్చి అన్నం తింటుంటాడు. దీంతో మిగిలిన వాళ్లందరూ ఆయన్న గట్టిగా తిడతారు. మనం పెళ్లిచూపులకు వెళ్లలేదన్న ఆలోచన కూడా ఈ మనిషికి లేదని కోప్పడతారు. నువ్వు సరిగ్గా ఉంటే మాకు ఇలా బాధపడాల్సిన పనిలేదంటారు. ఇంతలో బ్రోకర్‌ ఫోన్ చేసి పెళ్లి చూపులకు ఎందుకు రాలేదని నిలదీస్తాడు. ఇంతలో చక్రి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు.అయితే పెళ్లిచూపులకు రేపు వస్తారని ఆడపెళ్లి వాళ్లకు చెబుతానంటే  వారంతా సరేనంటారు. ఇక అందరూ కలిసి భోజనం చేసి రేపటి ఏర్పాట్లు గురించి చర్చించుకుంటారు.                           

                    ఉదయం నిద్రలేచి కిందకు వచ్చేసరికి ఇంట్లో హడావుడి చూసి మహా ఆశ్చర్యపోతుంటుంది. ఏంటి ఏర్పాట్లని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈ హడావుడి ఏంటని వాళ్ల వదినను అడగ్గా..తనకూ ఏం తెలియదని చెబుతుంది. అప్పుడు  మహా వాళ్లను అడుగుతుంది. ఇంతలో వచ్చిన బంధువులు ఇవాళ మహాలక్ష్మీ పెళ్లిచూపులు కదా అని చెబుతారు. నాకు ఎందుకు చెప్పలేదని మహా వాళ్ల అమ్మపై కోప్పడుతుంది.అసలు నాకు చెప్పకుండా నా పెళ్లిచూపులు ఎవరు అరెంజ్‌  చేయమన్నారు అని అంటుంది. రాత్రి నువ్వు నిద్రపోయాక వాళ్లు ఫోన్ చేసి అడిగారని...మంచి సంబంధం కాబట్టి వెంటనే ఓకే చెప్పానని తండ్రి ప్రతాప్ బదులిస్తాడు. నాకు ఇప్పుడే పెళ్లివద్దని...నాకు కూడా లైఫ్‌లో గోల్‌ ఉంటుంది కదా...అది రీచ్‌ అవ్వకుండా పెళ్లి ఎలా చేసుకోనని నిలదీస్తుంది.

వాళ్లంతా ఒప్పించే ప్రయత్నం చేయగా...ఇప్పుడే  వస్తానని చెప్పి తాను పైకి పరుగెడుతుంది. తాను ఇంజినీరింగ్ గోల్డ్‌ మెడలిస్టునని చెప్పి మెడల్స్‌ మొత్తం చూపిస్తుంది. ఇవన్నీ సాధించింది..పెళ్లిచేసుకుని  వెళ్లిపోవడానికా అని ప్రశ్నిస్తుంది. ఇంత చదువు చదివి ఇంత పేరు తెచ్చుకుని ఇప్పుడు ఎవరినో కట్టుకుని విదేశాలకు వెళ్లిపొమ్మంటావా అని అడుగుతుంది. నీ కూతుర్ని గొప్ప పొజిషన్‌లో చూడాలని నీకు లేదా అని నిలదీస్తుంది. అన్నీ విన్న తర్వాత తండ్రి మాత్రం వాళ్ల ఆల్రెడీ వచ్చేసుంటారు...నువ్వు లోపలికివెళ్లి రెడీ అయి రా అంటూ పంపించడంతో ఇవాల్టి ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.