Jagadhatri Serial Today Episode: దేవదాయశాఖ మంత్రిని గుడి ముందే చంపాల్సిన అవసరం మీనన్‌కు ఏం వచ్చిందని జేడీ,కేడీ ఆలోచిస్తుంటారు. ఖచ్చితంగా దీని వెనక ఎదో స్ట్రాంగ్ రీజన్ ఉండి ఉంటుందని జేడీ అంటుంది.కేవలం మినిష్టర్ మీద కోపంతోనే చంపి ఉండడని భావిస్తుంది. వాడు అడిగిన పని ఏదో చేసి ఉండడు అందుకే మినిస్టర్‌ను మీనన్ చంపేసి ఉంటాడని కేడీ అంటాడు. ఇది రివేంజ్ మర్డర్ కాదని జేడీ అంటుంది. ఆ మినిష్టర్‌ను చంపేసి ఆ ప్లేస్‌లోకి తన మనిషిని తీసుకురావాలని అనుకున్నాడా అని అనుమానిస్తుంది. ఒకవేళ అలా అనుకున్నా....దేవదాయశాఖ మంత్రినే ఎందుకు టార్గెట్ చేసి ఉంటాడని ఆలోచిస్తుంది. ఆ దేవాలయాల చుట్టూనే ఏదోఉండి ఉంటుందని అంటుంది. ఇంతలో రమ్య కాల్ చేసి....హవాలా రూపంలో 200 కోట్లు హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని....ఎవరికి వెళ్లాయో తెలియలేదని చెబుతుంది. దీంతో ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారని జేడీ, కేడీ అనుకుంటారు.
మీనన్‌కు మరో కొత్త డీల్‌వస్తుంది. ధర్మపురి గుడిలో పురాతన పంచలోహ విగ్రహాలను చాలా ఏళ్ల తర్వాత బయటకు తీసి జాతర చేస్తున్నారని.. ఆ విగ్రహాలు తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెబుతారు. ఉత్సవాలు ఈరోజే కాబట్టి సాయంత్రంలోగా ఆ విగ్రహాలు తెచ్చిఇవ్వాలని చెబుతారు. దీనికి మీనన్ ఓకే చెబుతాడు. ఇంతలో ఇన్‌ఫార్మర్‌ల నుంచి రమ్య ద్వారా జేడీకి సమాచారం అందుతుంది. ఫారెన్ నుంచి ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిందని తెలుస్తుంది. ఎందుకు వచ్చారని జేడీ,కేడీ ఆలోచిస్తుండగానే....మీనన్ తన మనుషులతో ధర్మపురి బయలుదేరి వెళ్తాడు. అటు గుడిలో దుర్గ చెల్లి కిందపడిపోతే...చిరు ఎత్తుకుని తీసుకునివస్తాడు. దీంతో దుర్గ...చిరు చెంప పగులగొడుతుంది. పెళ్లికాని పిల్లను అందరిముందు ఎత్తుకుని రావడం ఏంటని కోప్పడుతుంది. అతను కావాలని చేయలేదని...తాను కిందపడి నడవలేకపోతుంటేనే చిరు ఎత్తుకున్నాడని దుర్గా చెల్లి చెబుతుంది. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దుర్గా తన చెల్లిని పక్కకు తీసుకెళ్లి...ఆ చిరంజీవిని సమర్థిస్తావా అని మండిపడుతుంది. చాలా విషయాల్లో నువ్వు వాడిని సమర్థిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అన్నయ్య,కార్తీక్ ప్రాణాలు పోవడానికి కారణం వాడేనని....ఇవన్నీ తెలిసినా మీకోసమే నేను నోరుమూసుకుని ఊరుకుంటున్నానని...కానీ వాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని చెబుతుంది. ఈలోగా గుడిలో విగ్రహాలు మాయం చేయడానికి మీనన్ అక్కడికి మనుషులతో వస్తాడు. చిరంజీవి సిగిరెట్ వెలిగించుకోవడానికి మీనన్ దగ్గరకు వెళ్లి లైటర్ అడిగి తీసుకుంటాడు. ఆ సమయంలో కారులో ఉన్న గన్‌లు చూస్తాడు. అతనికి అనుమానం వచ్చి నువ్వు ఏం పనిచేస్తుంటావ్ అని మీనన్‌ను అడుగుతాడు. రకరకాల ప్రశ్నలు వేసి విసిగిస్తుంటాడు. దీంతో మీనన్‌కు కోపం పెరిగిపోతుంటుంది. విగ్రహాల కోసం వచ్చావా ఏంటి అని నిలదీస్తాడు. మీనన్ గట్టిగా సమాధానం చెప్పేసరికి చిరంజీవి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. పంచలోహ విగ్రహాలకు పూజలు జరుగుతుండగా...మీనన్ మనుషులు అక్కడికి రావడం చిరంజీవి గమనిస్తాడు. అతను ఏదో కీడు శంకిస్తాడు. అందరి వద్ద గన్‌లు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. వారంతా ఎటు వెళ్లారా అని చిరంజీవి వెతుకుతుండగా....గతంలో తన బిడ్డ ప్రాణాలు తీశాడన్న కోపంతో చిరంజీవిని చంపడానికి ఓ మహిళ కత్తిపట్టుకుని రాగా....దుర్గా చెల్లి ఆమెను అడ్డుకుని చిరంజీవి ప్రాణాలు కాపాడుతుంది.ఇంతలో మీనన్ మనుషులు విగ్రహాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా...చిరంజీవి వారిని అడ్డుకుంటాడు. ఈలోగా జేడీ,కేడీ సైతం అక్కడికి రావడం చూసి దేవా భయంతో వణికిపోతాడు. గుడిలో మీనన్ మనుషులను చూసి చిరంజీవియే కేడీకి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో వాళ్లు అక్కడికి వస్తారు. దీంతో ముగ్గురు కలిసి మీనన్ మనుషులను చావగొడతారు..