Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక ఆవేశపడుతుంటే పద్మాక్షి అంబికను ఆపాలని చూస్తుంది. ఆ లక్ష్మీ కోసం అంత ఇదైపోతున్నావ్ నీకు దానికి సంబంధం ఏంటి అని అంబిక విహారిని ప్రశ్నిస్తుంది. ఆ లక్ష్మీ నీ దగ్గర ఎండీ పోస్ట్ వదిలేసి వెళ్లిపోయింది అంటే నీ కంటే పెద్ద ఆఫర్ ఎవరో ఇచ్చుంటారు అందుకే వెళ్లిపోయింటుందని అందుకే నిన్ను వదిలేసి వాడిని తగులుకొని పోయిందని అంబిక అంటుంది. 

Continues below advertisement

అంబిక మాటలకు విహారి అరుస్తాడు. ఏంట్రా అరుస్తున్నావ్.. నేను తప్పుగా మాట్లాడటం లేదు దాని బుద్ధే అంత అని అంబిక అంటుంది. విహారి ఆవేశపడుతుంటే సహస్ర అడ్డుకొని విహారిని తీసుకెళ్లిపోతుంది. అంబిక ఆవేశపడుతుంటే పద్మాక్షి అంబికను సైలెంట్‌గా ఉండమని అంటుంది. ఇదంతా నా వల్లే అని కావేరి ఏడుస్తుంది. అంబిక మాటలు గుర్తు చేసుకొని విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తాడు. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి అంబిక అత్తయ్యా కారణం కాకపోవచ్చు అందుకే ఇంత గట్టిగా మాట్లాడిందని అనుకుంటాడు. 

యమున విహారితో లక్ష్మీ గురించి మాట్లాడుతుంది. ఈ సారి ఆ పిల్ల ఎవరి భారం నెత్తి మీద వేసుకుందో అని అంటుంది. ఆ మాటలు కావేరి విని బాధ పడి వెళ్లిపోతుంది. మరోవైపు అమ్మిరాజుకి మెలకువ వస్తుంది. తన కట్లు విప్పమని తండ్రికి కేకలు వేస్తాడు. కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక కావేరి తనవల్లే ఇదంతా అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మిరాజు కట్లు విప్పుకొని బయటకు వస్తాడు. 

Continues below advertisement

కావేరి అంతా నా వల్లే అని ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్యాన్‌కి ఉరి పెట్టుకుంటుంది. కావేరి ఉరి వేసుకున్న నీడ విహారి చూసి కావేరిని కాపాడుతాడు. ఏమైంది కావేరి చావాల్సిన అవసరం నీకు ఏంటి అని అంటాడు. నేను చస్తే మీరంతా సంతోషంగా ఉంటారు అని కావేరి ఏడుస్తుంది. అంత సమస్య ఏం వచ్చిందని కావేరిని విహారి అడుగుతాడు. దానికి కావేరి లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లడానికి కారణం నేనే అని విషయం మొత్తం విహారికి చెప్తుంది. 

అమ్మిరాజు కావేరికి ఫోన్ చేస్తాడు. సంధ్య అమ్మిరాజు ఫోన్ ట్రాప్ చేయడం వల్ల సంధ్య, లక్ష్మీ   కూడా అమ్మిరాజు ఎవరితో మాట్లాడుతాడో వినాలని అనుకుంటారు. విహారి కావేరితో నిన్ను బ్లాక్ మెయిల్ చేసిన వాడే కాల్ చేస్తున్నాడు మాట్లాడు అని అంటాడు. స్పీకర్ పెడతాడు. అమ్మిరాజు కావేరితో నేను నీ కాబోయే మొగుడు అమ్మిరాజుని,, వీడియో చూసి భయపడుతున్నావా.. అది పంపించింది నేనే అని చెప్తాడు. వీడియో డిలీట్ చేయమని కావేరి బతిమాలుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి పూర్తిగా నాదానివి అయితే అప్పుడు పూర్తిగా డిలీట్ చేస్తా అని అంటాడు. 

కావేరికి తన దగ్గరకు రమ్మని ఓ అడ్రస్ చెప్తాడు. చెప్పిన అడ్రస్‌కి రాకపోయినా పిచ్చి వేషాలు వేసినా వీడియో వైరల్ అయిపోతుందని బెదిరిస్తాడు. విహారి కావేరితో అమ్మిరాజుని పట్టుకొని ఆ వీడియో నేను డిలీట్ చేయిస్తా అని కావేరిని తీసుకెళ్తాడు. లక్ష్మీ, సంధ్యలు కూడా అమ్మిరాజుని పట్టుకొని వీడియో డిలీట్ చేయించాలని వెళ్తారు. వీర్రాజు నిద్రలో లేచి చూసే సరికి కాళ్లు చేతులు కట్టేసి ఉంటాయి. ఎవర్రా నన్ను తాడుతో కట్టింది అని పానకాలుని నిద్ర లేపుతాడు. పానకాలు చూసి కట్లు విప్పుతాడు. ఇద్దరూ లేచి అమ్మిరాజు కోసం వెతుకుతారు. వీడు ఆ కావేరి కోసమే వెళ్లుంటాడురా  ఎలా అయినా వీడిని కాపాడుకోవాలి అని అనుకుంటాడు.

వీర్రాజు వెంటనే అంబికకు కాల్ చేస్తాడు. అంబికకు విషయం చెప్తాడు. వీర్రాజు తన కొడుకుని కాపాడమని అంబికను బతిమాలుతాడు. ఇక లక్ష్మీ, సంధ్య లొకేషన్‌కి వస్తారు. కావేరి, విహారి అక్కడే ఉంటారు. లక్ష్మీ, సంధ్యలు కావేరిని మాత్రమే చూస్తారు. ఇంతలో అమ్మిరాజు వస్తాడు. అమ్మిరాజుని చూసి కావేరి విహారితో చెప్తుంది. విహారి అమ్మిరాజు దగ్గరకు పరుగు పెడతాడు. విహారి అమ్మిరాజుని పట్టుకునేలోపు అంబిక వచ్చి అమ్మిరాజుని తీసుకెళ్లిపోతుంది. సంధ్య వాళ్ల కారు, విహారి వాళ్ల కారు అంబిక వాళ్లని ఫాలో అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.