Samsung Solid State Oxide Battery Technology: శాంసంగ్ ఇటీవల సియోల్‌లో ఎస్ఎన్ఈ బ్యాటరీ డే సందర్భంగా ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ప్రత్యేక సాలిడ్ స్టేట్ ఆక్సైడ్ బ్యాటరీని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఈ బ్యాటరీ గురించి అత్యద్భుతమైన విషయాలు ఇప్పుడు బయటకి వచ్చాయి. ఈ టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రిక్ కారును తొమ్మిది నిమిషాలు ఛార్జ్ చేస్తే 965 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ అంటోంది.


ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీకి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారని మనం గమనించాలి. పెద్ద పెద్ద కార్ల కంపెనీలు కూడా ఈవీ విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే కారణం. ఇప్పుడు శాంసంగ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక బ్యాటరీని ప్రదర్శించింది.


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి


సింగిల్ ఛార్జ్‌తో 965 కిలోమీటర్లు...
ఈ శాంసంగ్ బ్యాటరీ గురించి ఇది ఒక ఛార్జ్‌లో 600 మైళ్ల (965 కిలోమీటర్లు) వరకు డ్రైవింగ్ పరిధిని ఇవ్వగలదని, కేవలం తొమ్మిది నిమిషాల్లో దీన్ని ఛార్జ్ చేయవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దీంతో పాటు బ్యాటరీ జీవితకాలం దాదాపు 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ శాంసంగ్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 480 కేడబ్ల్యూ నుంచి 600 కేడబ్ల్యూ వరకు ఛార్జర్ అవసరం. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ బ్యాటరీ టెక్నాలజీని భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించవచ్చు.


సాలిడ్ స్టేట్ బ్యాటరీ అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఏ లిక్విడ్ కాంపోనెంట్ లేని లిథియం అయాన్ బ్యాటరీ లాంటిది. నేటి ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలలో కాథోడ్, యానోడ్ మధ్య ద్రవ ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని యూజ్ చేస్తారు. మరోవైపు సాలిడ్ స్టేట్ బ్యాటరీల గురించి మాట్లాడితే ఇందులో సాలిడ్ ఎలక్ట్రోలైట్లను శాంసంగ్ కంపెనీ ఉపయోగించింది.


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్