Hyundai Venue Price And Features: కార్ కొనేవాళ్లకు 'హ్యుందాయ్ మోటార్' గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రసిద్ధ SUV 'వెన్యూ'పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. స్టైలిష్ కార్‌గా కనిపిస్తూనే మీ కుటుంబానికి సురక్షితమైన & నమ్మదగిన ప్రయాణం అందించే బడ్జెట్ SUV ఇది. కాబట్టి, మే నెలను హ్యుందాయ్ వెన్యూ కొనడానికి ఒక గొప్ప అవకాశంగా చూడొచ్చు. ఈ SUV, హ్యుందాయ్ క్రెటా తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండో కారు.
తెలుగు రాష్ట్రాల్లో 75,000 వరకు డిస్కౌంట్తెలుగు రాష్ట్రాల్లో, ఈ నెలలో హ్యుందాయ్ వెన్యూ కొంటే రూ. 75,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ & కార్పొరేట్ ఆఫర్ రూపంలో లభిస్తుంది. ఈ డిస్కౌంట్ MY24 స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఆఫర్ వివిధ నగరాలు & డీలర్‌షిప్‌లలో మారవచ్చు. వెన్యూ SUVని కొనుగోలు చేసే ముందు షోరూమ్ నుంచి పూర్తి వివరాలు పొందండి.
7 వేరియంట్లలో హ్యుందాయ్ వెన్యూ హ్యుందాయ్ కంపెనీ, వెన్యూ SUVని మొత్తం 7 వేరియంట్లలో లాంచ్ చేసింది, అవి - E, E+, Executive, S, S+/S(O), SX & SX(O). దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్‌ను బట్టి రూ. 7.94 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.53 లక్షల వరకు ఉంటుంది. ప్రతి వేరియంట్‌లో విభిన్న ఫీచర్లు & సేఫ్టీ ఎలిమెంట్స్‌ను కంపెనీ అందిస్తోంది. తెలుగు ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఒక వెర్షన్ ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ వెన్యూ వెర్షన్లలో వైవిధ్యం & వాల్యూ ఫర్ మనీ అప్పీల్ దీనిని భారతీయ మార్కెట్లో పాపులర్ SUVగా మార్చింది.
హ్యుందాయ్ వెన్యూ ఇంజిన్ & మైలేజ్మూడు ఇంజిన్ ఆప్షన్లలో హ్యుందాయ్ వెన్యూ పవర్ పొందుతుంది - 1.2L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0L టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ & 1.5L డీజిల్ ఇంజన్. కంపెనీ ప్రకారం, వెన్యూ గరిష్ట మైలేజ్ లీటరుకు 23 కిలోమీటర్లు.
హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు & సేఫ్టీ హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు ఈ ఫోర్‌వీలర్‌ను ప్రీమియం SUV అని ఫీల్ అయ్యేలా చేస్తాయి. 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ & ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ప్రీమియం కార్ ఫీచర్లను ఇందులో చూడవచ్చు.
భద్రత పరంగా, హ్యుందాయ్ వెన్యూలో 6 ఎయిర్ బ్యాగులు, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా & ట్రాక్షన్ కంట్రోల్ వంటివి అమర్చారు. దీని టాప్ వేరియంట్లలో లెవల్-1 ADAS సిస్టమ్ కూడా ఉంది, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ & హై బీమ్ అసిస్ట్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతలను దీనిలో అమర్చారు. ఈ సాంకేతికతలు హ్యుందాయ్ వెన్యూను సేఫ్, స్మార్ట్ & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ SUVగా మార్చాయి.
భారత మార్కెట్లో, హ్యుందాయ్ వెన్యూకు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, మహీంద్రా XUV300 & నిస్సాన్ మాగ్నైట్ వంటి SUVలు పోటీ కార్‌లుగా ఉన్నాయి.