Blast In Mulugu District | వాజేడు: పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు సమాచారం. బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటపురం ఎడ్మిల్లి కొండలపై కూంబింగ్ కు వెళ్లిన గ్రేహౌండ్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడి మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్ పోలీసులు మృతి చెందారు. మావోయిస్టులను తిప్పికొట్టేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. ఫైరింగ్ కొనసాగుతున్న ఎడ్మిల్లి కొండ ప్రాంతం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. బాంబుల మోత, ఎన్ కౌంటర్లతో కర్రెగుట్టలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.
కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్మరో వైపు 17 రోజులుగా కర్రెగుట్టల్లో బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా కర్రెగుట్టల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో వేలాది మంది పారామిలటరీ బలగాలతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లతో అపరేష్ కొనసాగుతుంది. కర్రెగుట్టలతో పాటు వాటి చుట్టు ఉన్న గుట్టల్లో మావోయిస్టుల డెన్ ప్రాంతాలను గుర్తించి, భద్రత బలగాలు దొబి కొండ స్వాధీనం చేసుకొని ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ లు, ఐ ఈ డీ లో పేలుళ్లతో బలగాలు మృతి చెందడం, గాయాలకు గురవుతున్నారు.
బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రేగుట్టల్లో జరిగిన ఎన్బికౌంటర్ 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ తరువాత ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ 22 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మార్చి 31 2026 వరకు. దేశవ్యాప్తంగా మావోయిజం అంతమవుతుందని ఆ లక్ష్యంగా బలగాలు ముందుకు వెళ్తున్నాయని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి చెప్పారు.