Subham Twitter Review: నిర్మాతగా 'సమంత' హిట్ కొట్టారా? - 'శుభం' మూవీ మెప్పించిందా?.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Subham Movie Twitter Review: సమంత 'శుభం' మూవీ ఇప్పటికే పలుచోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ మూవీపై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మరి నిర్మాతగా సమంత సక్సెస్ అయ్యారా..?
Samantha Subham Movie Twitter Review Netizens Reaction: 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ ప్రారంభించి 'సమంత' (Samantha) నిర్మించిన ఫస్ట్ మూవీ 'శుభం' (Subham). ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ షోలు పడగా.. సమంత కొత్త మూవీపై ఇప్పటికే చర్చ మొదలైంది. నెటిజన్లు ఏమనుకుంటున్నారో ఓసారి చూస్తే..
'సమంత' హిట్ కొట్టారా?
నిర్మాతగా సమంతకు ఇది ఫస్ట్ మూవీ. సినిమాలో ఆమె ఓ డిఫరెంట్ రోల్ కూడా చేశారు. మొదటి నుంచి ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు సమంత. ప్రమోషన్స్ కూడా అలానే చేశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన వారు నవ్వుకుంటూనే వస్తారనే ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
నెటిజన్లు ఏంటున్నారంటే?
సమంత చెప్పినట్లుగానే ఈ మూవీ పుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ఆద్యంతం నవ్వులు పూయిస్తోందని.. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా అంటున్నారు. ఫస్టాఫ్ కామెడీ పీక్స్ అని.. సెకండాఫ్ కొంచెం బోరింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు.
కొత్త వారు బాగా యాక్ట్ చేశారని.. అయితే, చాలా వరకూ స్టోరీ స్లోగా ఉంటుందని అదే సినిమాకు మైనస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రవీణ్ కాండ్రేగుల మూవీ స్టార్టింగ్‌లో చూపించిన హైప్ చివరి వరకూ కొనసాగించలేకపోయారని అనుకున్నంత మార్క్ చేరుకోలేదని కొందరు అంటున్నారు.
డిఫరెంట్ కామెడీ
ఈ మూవీ ఓ డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని 'సినిమా బండి'ని ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నిర్మాత 'సమంత' తన ఫస్ట్ మూవీతో సక్సెస్ కొట్టారని.. కామెడీ మూవీస్‌లో డిఫరెంట్ స్టైల్ కోరుకునే వారికి ఇది మంచి ట్రీట్ అంటూ రాసుకొచ్చాడు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
సమంత 'శుభం' చాలా బాగుందని.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మూవీలో కామెడీ టైమింగ్ అద్భుతమని.. కొత్త వారి యాక్టింగ్ బాగుందని చెప్పాడు. సమంత నిర్మాతగా సక్సెస్ అయ్యారంటూ రాసుకొచ్చాడు.
Also Read: థియేటర్లలో విడుదలైన 20 రోజులకే Prime Videoలోకి 'ఓదెల 2'... ఐదు భాషల్లో తమన్నా సినిమా స్ట్రీమింగ్