Royal Enfield New Bike Launch: బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకదాని తర్వాత ఒకటిగా ఆరు బైక్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024లో క్లాసిక్ ఫ్రాంచైజీ మోడళ్లు మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. దీనితో పాటు మరో ఐదు మోడల్స్ కూడా ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఐదు బైక్‌లలో గోవాన్ క్లాసిక్ 350, స్క్రామ్ 440, గెరిల్లా 450, ఇంటర్‌సెప్టర్ బేర్ 650, క్లాసిక్ 650 ఫస్ట్ ఉన్నాయి. ఈ బైక్‌ల విడుదలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో దాదాపు 50 శాతం పెరగనుంది.
కొత్త క్లాసిక్ మోడల్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ ఫ్రాంచైజీ మోడల్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లాసిక్ ఫ్రాంచైజీకి చెందిన ఫేస్‌లిఫ్ట్, వేరియంట్లు, పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ బైక్‌లు మార్కెట్లోకి వస్తాయి. ఈ మోడల్‌తో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే కాలంలో మరో ఐదు బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.
గెరిల్లా 450
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో 452 సీసీ ఇంజన్ ఉంటుంది. దీనికి ముందు వచ్చిన న్యూ హిమాలయా కూడా ఈ ఇంజిన్ ఆధారితంగానే మార్కెట్లోకి వచ్చింది. గెరిల్లా 450 డిజైన్ కొంచెం స్లిమ్, మినీ మినిమలిస్ట్‌గా ఉంటుంది.
ఇంటర్‌సెప్టర్ బేర్ 650
650 సీసీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన మొదటి ఆఫ్ రోడ్ సామర్థ్యం గల బైక్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఉండనుందని తెలుస్తోంది. ఈ బైక్‌లో 650 ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చవచ్చు.
క్లాసిక్ 650
క్లాసిక్ 350 ఆకర్షణ, స్టైలింగ్‌తో క్లాసిక్ 650 ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ఈ బైక్ ఇంజన్ పెద్దదిగా ఉంటుంది. తద్వారా ఇందులో 650 సీసీ ప్యారలల్ ట్విన్ మోటారును అమర్చవచ్చు. దాని సబ్‌ఫ్రేమ్, ప్రయాణీకుల సీటును చూస్తే షాట్‌గన్ 650 గుర్తుకు రావచ్చు.
స్క్రామ్ 440
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440లో 450 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్లాట్‌ఫారమ్ అందించబడలేదు. దాని బదులు ఇది ఎయిర్/ఆయిల్ కూల్డ్ 440 సీసీ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ బైక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. కొత్త హిమాలయన్‌తో పోలిస్తే ఈ బైక్ పనితీరు కొంచెం తక్కువగా ఉండవచ్చు.
గోవాన్ క్లాసిక్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనున్న బైకుల జాబితాలో గోవాన్ క్లాసిక్ 350 కూడా చేరింది. ఈ బైక్ కొన్ని మోడల్‌లు 2024లో వచ్చే అవకాశం ఉంది. వీటిలో వైట్ బాల్ టైర్‌లను ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?