Royal Enfield Super Meteor 650 India Launch: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మనదేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది యువకులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనడం అనేది ఒక కల. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ బైకులను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ మోడల్‌లో 650 సీసీ బైకులు త్వరలో రానున్నాయి.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 మీటియోర్ కంటే దీని సైజు పెద్దగా ఉండనుంది. దీని స్టైలింగ్ కూడా చూడటానికి క్రూజర్ తరహాలో ఉండనుంది. దీనికి సంబంధించిన స్పై ఇమేజెస్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి దీనికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.


ఇందులో వెనకవైపు స్వెప్ట్ బ్యాక్ బార్లు, మధ్యలో ఉన్న ఫుట్ పెగ్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఇందులో ఎల్ఈడీ లైట్, పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండనున్నాయి. ఎక్కువ దూరాలు ప్రయాణం చేయడానికి ఇందులో పెద్ద విండ్ షీల్డ్‌ను అందించారు. వెనకవైపు టైర్ కూడా పెద్దగా ఉండనుంది.


దీని ట్యాంకు కూడా టియర్ డ్రాప్ ఆకారంలో ఉండనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 రేంజ్ కంటే ఇది కొంచెం కొత్తగా ఉండనుంది. ఇది 47.6 పీఎస్, 52 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ తరహాలోనే దీని అవుట్‌పుట్ ఉండనుంది.


అయితే మరింత స్మూత్‌గా ఉండటానికి పవర్ ఫ్రెండ్లీగా ఉండేలా దీని ఇంజిన్ రూపొందించనున్నారు. కనిపించిన ఫొటోల ప్రకారం... దీంతోపాటు యాక్సెసరీస్ కూడా అందించనున్నారు. రెండు వైపులా డిస్క్‌లు, డ్యూయల్ చానెల్ యాబ్స్, యూఎస్‌డీ ఫోర్కులు కూడా ఇందులో ఉండనున్నాయి.


ఈ ఇమేజెస్ ప్రకారం ఈ బైక్ ప్రొడక్షన్‌కు దాదాపు సిద్ధం అయింది. వచ్చే సంవత్సరం లాంచ్ కానుంది. ఇక ధర విషయానికి వస్తే... రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ బైకుల్లో ఇది మోస్ట్ ప్రీమియం బైక్ అయ్యే అవకాశం ఉంది. కవాసకీ వొల్కన్ ఎస్‌తో ఈ బైక్ పోటీ పడనుంది.


Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!


Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!