Royal Enfield  Meteor 350 Special Edition: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీటియోర్‌ 350 మోడల్‌ రోజువారీ రైడింగ్‌, వీకెండ్‌ టూరింగ్‌, సిటీ కమ్యూటింగ్‌లో బాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే లైనప్‌లోకి కొత్త అందాన్ని, కొత్త కంఫర్ట్‌ను తీసుకొచ్చేలా కంపెనీ మీటియోర్‌ 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ వెర్షన్‌ను మోటోవర్స్‌ 2025లో ఆవిష్కరించింది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ మాత్రమే. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ బుకింగ్స్‌ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కాగా, దీని ఎక్స్‌-షోరూమ్‌ ధరను ₹2,18,882గా ప్రకటించారు.

Continues below advertisement

కొత్త కలర్‌ – కొత్త స్టైల్‌

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీటియోర్‌ 350 కొత్త లాంచ్‌లో పెద్ద ఆకర్షణ - సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ కలర్‌ స్కీమ్‌. ప్రకాశవంతంగా కనిపించే ఈ పెయింట్‌ షేడ్‌ బైక్‌కు ఓ ఎనర్జిటిక్‌ వైబ్‌ ఇస్తుంది. స్ట్రీట్‌లో నిలబెట్టినా, హైవేపై పరుగెత్తించినా... మీటియోర్‌ 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ ప్రత్యేకంగా కనిపించేలా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ కలర్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది.

Continues below advertisement

కంఫర్ట్‌ పెంచే ఫీచర్లు ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్‌లో

చాలా మంది రైడర్లు టూరింగ్‌కి వెళ్లేటప్పుడు తమ కంఫర్ట్‌ & అవసరాల కోసం వేర్వేరు యాక్సెసరీస్‌ను విడిగా కొనుగోలు చేస్తారు. కానీ ఈ ఎడిషన్‌లో అవన్నీ ఫ్యాక్టరీ ఫిట్టింగ్‌గానే ఉన్నాయి, అవి:

  • టూరింగ్‌ సీటు – దీర్ఘ ప్రయాణాల్లో మంచి కంఫర్ట్‌
  • ఫ్లీస్క్రీన్‌ – ఎదురు గాలి తీవ్రతను తగ్గిస్తుంది
  • పాసెంజర్‌ బ్యాక్‌రెస్ట్‌ – వెనుక కూర్చున్న వారికి సపోర్ట్‌
  • ట్రిప్పర్‌ నావిగేషన్‌ – టర్న్‌-బై-టర్న్‌ గైడ్‌
  • అల్యూమినియం ట్యూబ్‌లెస్‌ స్పోక్‌ వీల్స్‌
  • అడ్జస్టబుల్‌ బ్రేక్‌, క్లచ్‌ లీవర్లు
  • LED హెడ్‌ల్యాంప్స్‌
  • USB టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్‌
  • మోటోవర్స్‌ 2025 మెమోరియల్‌ బ్యాడ్జ్‌
  • ఈ ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ ఫీచర్లు మొత్తం బైక్‌ను మరింత ప్రీమియంగా మార్చాయి.

ఇంజిన్‌ – అదే నమ్మకమైన 349cc పెర్ఫార్మెన్స్‌

ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో ఇంజిన్‌ మార్పు ఏమీ లేదు. మీటియోర్‌లో అందరికీ తెలిసిన అదే 349.34 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 20.2 bhp పవర్‌, 27 Nm టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో కలిసి ఈ ఇంజిన్‌ చాలా స్మూత్‌గా, బిగినర్‌ రైడర్లు కూడా సులభంగా నడిపేలా ఉంటుంది. స్లిప్‌-అండ్‌-అసిస్ట్‌ క్లచ్‌ ఉండటం వల్ల గేర్‌ మార్చడం మరింత సులభం.

రైడింగ్‌ & హ్యాండ్లింగ్‌ – నగరంలోను, హైవేపైనా అదే కంఫర్ట్‌

మీటియోర్‌ 350 ప్లాట్‌ఫామ్‌కు స్టెబిలిటీ విషయంలో మంచి పేరుంది. ట్విన్‌ డౌన్‌ట్యూబ్‌ ఫ్రేమ్‌, 41 mm ఫ్రంట్‌ ఫోర్క్స్‌ (130 mm ట్రావెల్‌), రియర్‌లో 6-స్టెప్‌ అడ్జస్టబుల్‌ షాక్‌ అబ్జార్బర్స్‌... ఇవన్నీ సిటీ రోడ్లు, హైవేలు అనే తేడా లేకుండా మంచి కంఫర్ట్‌ ఇస్తాయి.

డైమెన్షన్స్‌ – బిగినర్స్‌కి బెస్ట్‌

బైక్‌ సీటు ఎత్తు 765 mm మాత్రమే కావడంతో తక్కువ హైట్‌ ఉన్న రైడర్లు కూడా సులభంగా హ్యాండిల్‌ చేయవచ్చు. 191 kg కర్బ్‌ వెయిట్‌ ఉన్నా బైక్‌ బ్యాలెన్స్‌ బాగా ఉంటుంది. 15 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉండటం దీర్ఘ ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, ఇది కొత్త రైడర్ల నుంచి సీజన్డ్‌ రైడర్ల వరకూ అందరికీ సూట్‌ అయ్యే క్రూయిజర్‌.

మీటియోర్‌ 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ స్టైల్‌, కంఫర్ట్‌, ప్రాక్టికాలిటీ అన్నీ ఒకే చోట కలిసిన బైక్‌. 350సీసీ సెగ్మెంట్‌లో కనిపించే అత్యంత ఆకర్షణీయమైన, రైడర్‌-ఫ్రెండ్లీ క్రూయిజర్‌లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.