రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లో లాంచ్ చేయనున్న బైక్‌ల్లో ఒకదాని మీద మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. కంపెనీ లాంచ్ చేయనున్న అత్యంత చవకైన బైక్ ఇదే అని తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆగస్టులో మార్కెట్లోకి రానుందని సమాచారం.మీటియోర్ 350, క్లాసిక్ 350ని రూపొందించిన జే ప్లాట్‌ఫాంపైనే దీన్ని కూడా రూపొందించారు.
దీని లుక్ చూడటానికి కూడా స్పోర్ట్స్ మోడల్ తరహాలో ఉంది. దీని మ్యాక్స్ పవర్ 20.2 బీహెచ్‌పీ కాగా... పీక్ టార్క్ 27 ఎన్ఎంగా ఉంది. 349 సీసీ ఇంజిన్‌ను ఇందులో అందించారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. ముందుగా చెప్పినట్లు దీని స్టైలింగ్ ప్రకారం చూస్తే ఇది స్పోర్ట్స్ లుక్‌తో లాంచ్ కానుంది.
రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ దక్కించుకోవడం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అక్కడే రాయల్ ఎన్‌ఫీల్డ్ దృష్టి పెట్టనుంది.
హోండా సీబీ 350 ఆర్ఎస్, జావా 42లతో ఇది పోటీ పడనుంది. హంటర్ 350 ధర రూ.1.5 లక్షల రేంజ్‌లో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎక్స్-షోరూం ధర. ఇది కొత్త రైడర్లకు బ్రాండ్‌ను పరిచయం చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?