Royal Enfield Bullet 350 Price, Mileage And Features In Telugu: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ డిజైన్‌తో రాయల్ అపీల్ కలిగిస్తుంది. మెటల్ ఫినిష్ ట్యాంక్, క్రోమ్ హైలైట్స్ & రౌండ్ హెడ్‌ల్యాంప్స్ దీని రూపాన్ని చాలా ప్రత్యేకంగా చూపిస్తాయి. పొడవైన ఫ్రేమ్ & సింగిల్ పీస్ సీటు ట్రెడిషనల్ మోటార్ సైకిల్ లుక్‌ను రీచార్జ్ చేస్తాయి. బుల్లెట్ 350 బాడీపై అల్లుకున్న హ్యాండ్‌క్రాఫ్ట్ డిజైన్ డీటెయిలింగ్స్, ఇది మాస్ బండి కాదు క్లాస్ బండే అనే ఫీల్ అందిస్తాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొనే ముందు, ఈ బైక్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. హైదరాబాద్, వరంగల్, విజయవాడ లేదా విశాఖపట్నంలో.. ఏ నగరం నుంచి ఈ బైక్ కొనడం చౌకగా ఉంటుందో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్-షోరూమ్ ధర (Royal Enfield Bullet 350 ex-showroom price) రూ. 1,76,625. RTO & బీమా, ఇతర అవసరమైన ఛార్జీలను కలిపిన తర్వాత, ఈ బైక్ ఆన్-రోడ్ ధర (Royal Enfield Bullet 350 on-road price) దాదాపు రూ. 2.11 లక్షలు అవుతుంది. వరంగల్ నగరంలోనూ ఇదే ఎక్స్-షోరూమ్ ధర, ఇదే ఆన్-రోడ్ ప్రైస్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 రూ. 1,76,625 ధర (ఎక్స్-షోరూమ్) పలుకుతోంది. RTO & బీమా, ఇతర అవసరమైన ఛార్జీలను కలిపిన తర్వాత, ఈ బైక్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 2.11 లక్షలు అవుతుంది. రాష్ట్రం మారలేదు కాబట్టి, విశాఖపట్నంలోనూ ఇదే ఎక్స్-షోరూమ్ ధర, ఇదే ఆన్-రోడ్ ప్రైస్ ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధర దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ.. RTO, బీమా వంటి చెల్లింపుల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు వర్తిస్తాయి.
బుల్లెట్ 350 ఇంజిన్ & ఫీచర్లుబుల్లెట్ 350 సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్ ప్యాకేజ్‌లా ఉంటుంది. ఈ బైక్‌లోని ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 bhp శక్తిని & 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ ఇంజిన్ 5-స్పీడ్ కాన్‌స్టంట్ మెష్ గేర్‌బాక్స్‌తోనూ జత కలుస్తుంది, స్మూత్ & స్ట్రాంగ్ రైడింగ్ ఫీల్ ఇస్తుంది.
బ్రేకింగ్ సిస్టమ్‌లో.. ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. భద్రత కోసం, దీనికి ABS వ్యవస్థ ఉంది. మిలిటరీ వేరియంట్‌లో సింగిల్ ఛానల్ & బ్లాక్ గోల్డ్ వేరియంట్‌లో డ్యూయల్ ఛానల్ ABS ఉన్నాయి. కలర్ ఆప్షన్‌లలో మిలిటరీ రెడ్, బ్లాక్, స్టాండర్డ్ మెరూన్ & బ్లాక్ గోల్డ్ ఉన్నాయి.
డిజైన్ విషయానికి వస్తే.. ఈ బైక్ ఇప్పటికీ రెట్రో లుక్‌నే కొనసాగిస్తోంది. రౌండ్ హెడ్‌లైట్లు, మెటల్ ఇంధన ట్యాంక్, వెడల్పాటి సైడ్ ప్యానెల్స్, శక్తిమంతమైన థంప్ సౌండ్ ఈ బండికి ప్రత్యేక ఆకర్షణ.
ఆ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది? ARAI సర్టిఫై చేసిన ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ లీటరుకు 35 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు. ట్యాంక్ నింపితే ఈ మోటార్ సైకిల్ దాదాపు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.