Meghasandesam Serial Today Episode: భూమి తమ్ముడు శివ గురించి తెలుసుకోవడానికి అలాగే పోలీస్ స్టేసన్‌లో ఉన్న కెమెరాను తీసుకెళ్లడానికి అపూర్వ, సుజాతతో కలిసి స్టేషన్‌కు వెళ్తుంది. పోలీసులను నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్లి దొంగచాటుగా ఆ బొమ్మ ఎలా ఉందో ఈ ఫోన్‌లో ఫోటో తీయ్ అని చెప్తుంది.
సుజాత: అది సరేలే అమ్మాయి మరి కారులో అవెందుకు ఉన్నాయి.
అపూర్వ: అవి నీకు ఇప్పుడు అర్థం కాదులే కానీ పదా..?
అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లిపోతారు.
కానిస్టేబుల్: నమస్తే మేడం..
అపూర్వ: నమస్తే నేను ఎస్సై గారిని కలవాలి.
కానిస్టేబుల్: ఆయన మర్డర్ అయి చనిపోయారు మేడం. కొత్తగా ఆ ప్లేస్‌లోకి ఎవ్వరూ రాలేదు.
అపూర్వ: మరి ఇప్పుడు స్టేషన్ హెడ్ ఎవరు..?
కానిస్టేబుల్: ఏ ఎస్సై కూడా లీవ్‌లో ఉన్నారు మేడం. టెంపరరీగా ఇప్పుడు స్టేషన్‌కు నేనే హెడ్
అపూర్వ: ఆ ఓకే నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి.
కానిస్టేబుల్: సరే మేడం రండి.. చెప్పండి మేడం..
అపూర్వ: చనిపోయిన ఎస్సై గారు చనిపోక ముందు మా ఆయనకు ఫోన్ చేశారు. మీ స్టేషన్‌కు ఒక పందోమ్మిది ఇరవై ఏళ్ల కుర్రాడు ఎవరో బొమ్మను పట్టుకుని వచ్చారంట. ఆ కుర్రాడి గురించి ఏదో చెప్పాలని మీ ఎస్సై గారు మా వారికి ఫోన్ చేశారు. పాపం చెప్పే లోపే ఆయన ఇలా చనిపోయారు. ఆ కుర్రాడు ఎవరో..? ఆ బొమ్మ ఏంటో..? మీ సీసీ కెమెరాలో చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు..?
కానిస్టేబుల్: నిజంగానే ఆ కుర్రాడి గురించి మీకు తెలియదా..?
అపూర్వ: తెలియకే కదండి వచ్చాము.
కానిస్టేబుల్: మా ఎస్సై గారు మీ వారికి ఫోన్ చేశారు. ఆ కుర్రాడి గురించి ఏదో చెప్పాలనుకున్నారు. కరెక్టా..?
అపూర్వ: కరెక్టే.. అయితే..
కానిస్టేబుల్: ఆ కుర్రాడెవరో ఆ బొమ్మేంటే మీరు సీసీటీవీ ఫుటేజీలో చూసి తెలుసుకుందామని వచ్చారు.
అపూర్వ: అవును
కానిస్టేబుల్: అంటే మా ఎస్సై గారిని మీరే మర్డర్ చేశారా..?
అపూర్వ: రేయ్ చిన్న పిట్ట పెద్ద పెద్ద కూతలు కూయకూడదురా..? నా అంతటి దాన్ని ఒక హెడ్డువు అయిన నువ్వు మర్డర్ చేశావా అని అడుగుతున్నావా..? ఎంత ధైర్యం నీకు .
కానిస్టేబుల్: పోనీ మీ లెవెల్‌కు మా డీఎస్పీ గారితో ఫోన్ చేయించనా.?.
అపూర్వ: అసలు నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని ఇంత రెచ్చిపోతున్నావు.
కానిస్టేబుల్: సాక్ష్యం లేదు. కానీ లాజిక్ ఉంది. భూమిని వెతుక్కుంటూ వచ్చిన భూమి తమ్ముని పేరు శివ. భూమి శరత్ చంద్ర గారి కూతురు అని నేనే చెప్పాను. ఆ మాట విని శివ మా కళ్లు కప్పి వెళ్లిపోయాడు. అంటే తిన్నగా మీ ఇంటికి రావాలి. కానీ రాలేదు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడో మీకు తెలియదు. ఆ బొమ్మలో ఏదో మీ సీక్రెట్ ఉంది. అంటే ఆ సీక్రెట్‌కు మీకు ఏదో కనెక్షన్ ఉంది. ఆ సీక్రెట్‌ను మీరు మాయం చేయాలి అనుకుంటున్నారు. మా సీసీ కెమెరాలో మీరు ఆ అబ్బాయిని చూడాలని వచ్చారు. నాకు తెలిసినంత వరకు మీరు ఇలా వచ్చారని మీ వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు.. ఇప్పుడే నేను శరత్ చంద్ర గారికి ఫోన్ చేస్తాను.
అపూర్వ: చూడు హెడ్డు నీ గెసింగ్ మొత్తం కరెక్టే.. కానీ మీ ఎస్సైని నేను చంపించలేదు.
అంటూ కానిస్టేబుల్‌కు బెదిరించి మర్యాదగా ఉంటే నీకు లాభం చేస్తాను అంటూ లంచం ఇస్తుంది అపూర్వ. లంచానికి లొంగిపోయిన కానిస్టేబుల్ అపూర్వకు సీసీటీవీ పుటేజీ చూపిస్తాడు. పుటేజీ చూసిన తర్వాత అపూర్వ వెళ్లిపోతుంది. తర్వాత గగన్ ఇంటికి వెళ్లిన భూమి తిరిగి ఇంటిక వస్తుంది. శరత్ చంద్ర కోపంగా చూస్తుంటాడు.
శరత్: చెప్పు భూమి నీకు ఇంకా ఆ గగన్ అంటే ఇష్టము ప్రేమ అలాగే ఉన్నాయా..? నాకు నీ సమాధానం కావాలి.
భూమి: లేదు.. నాన్న..
శరత్: నిజమేనా….
భూమి: నిజమే నాన్న..
శరత్: నేను నీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని అణువంతైనా సడలనివ్వలేదమ్మా నువ్వు. నా బంగారు తల్లివి నువ్వు. నువ్వు అడగకుండా నేనొక నిర్ణయం తీసుకున్నాననమ్మా..
అంటూ భూమికి పెళ్లి చేశానని మొన్న నువ్వు పెళ్లి చూపుల్లోంచి వెళ్లిపోయిన సంబధమే అని చెప్తాడు శరత్ చంద్ర. దీంతో భూమి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!