రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు, బైకర్లకు ఇది నిజంగానే గుడ్ న్యూస్, 2025 ఆగస్టు తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోడల్స్ కొనుగోలు చేసి ఉంటే కచ్చితంగా ఇది మీకు అవసరమైన వార్త. డిస్‌ప్లే మీటర్‌లో గేర్‌పొజిషన్ ఇండికేటర్ లేక ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇప్పుడు మార్చుకునే వెసులుబాటు సంస్థ కల్పిస్తోంది. రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా కొరత కారణంగా అప్పట్లో నిలిపివేసిన గేర్ పొజిషన్ ఇండికేటర్ ఫీచర్స్‌ను కంపెనీ ఇప్పుడు మళ్లీ తీసుకొస్తోంది. ఆగస్టు 2025 తర్వాత డిజైన్ చేసిన ఈ ఫీచర్ లేకుండా వచ్చిన క్లాసిక్ 350, హంటర్ 350, మిటియోర్ 350, గోవాన్ క్లాసిక్ 350 బైక్‌లకు ఇప్పుడు ఉచితంగా గేర్ ఇండికేటర్‌ను అమర్చనుంది.
గేర్ పొజిషన్ ఇండికేటర్ ఎందుకు నిలిపివేశారు?
గత ఏడాది ద్వితీయార్థంలో రాయల్ ఎనఫీల్డ్ నుంచి తమ డ్రీమ్ బైక్ డెలివరీ తీసుకున్న అనేక మంది రైడర్లు ఒక చిన్న లోపాన్ని గమనించారు. డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగిన జే సిరీస్ 350సిసి బైక్‌లలో గేర్ నెంబర్ చూపించే గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపించ లేదు. కేవలం ఎన్ అని పడే న్యూట్రల్ లైట్ మాత్రమే పని చేసింది. ఇది తయారీలో లోపం కాదు. గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభం. గేర్ పొజిషన్ సెన్సార్‌లలో ఉపయోగించే అత్యంత శక్తిమంతమైన మ్యాగ్నేట్స్ తయారీకి రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఖనిజాల సరఫరా హఠాత్తుగా నిలిచిపోవడంతో పార్ట్స్ కొరత ఏర్పడింది. బైక్ ప్రొడక్షన్ ఆపకుండా కస్టమ్ల డెలివరీలో జాప్యం జరగకూడదనే కారణంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తాత్కాలికంగా న్యూట్రల్ ఇండికేటర్‌తో బైక్‌లను విక్రయించింది. అయితే పరిస్థితులు చక్కబడితే ఉచితంగా ఈ పార్ట్ అమరుస్తామని అప్పుడే చెప్పింది.
రేర్ ఎర్త్ మినరల్స్ సంక్షోభం ఎలా సమసిపోయింది?
ఆటోమొబైల్ రంగానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెన్నెముక లాంటిది. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, ఆధునిక సెన్సార్లు, ఇంజిన్ కంట్రోల్ మోడ్యూలస్ తయారీలో వీటి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా వీటి తవ్వకాలు, ప్రాసెసింగ్‌పై చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. అయితే భారత్‌తోపాటు అమెరికా, అర్జెంటీనా, జపాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను ఏర్పరుచుకోవడంతోపాటు స్థానిక ఉత్పత్తిని పెంచడంతో ఈ విడి భాగాల కొరత తొలగిపోయింది. ఫలితంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ మళ్లీ సెన్సార్ల ప్రొడెక్షన్ పునరుద్దరించింది. భారతీయ వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండానే ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ చేపట్టింది.
ఉచితంగా గేర్ ఇండికేటర్ ఏయే మోడళ్లకు వర్తిస్తుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లోని అన్ని బైక్‌లకు వర్తించదు. కేవలం ఆగస్టు 2025 తర్వాత తయారు యిన వాహనాలకు మాత్రమే గేర్ ఇండికేటర్ లేకుండా డెలివరీ అయిన వాహనలకే వర్తిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350, రాయల్ ఎన్‌ీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోడల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది.
మీ బైక్‌కు వర్తిస్తుందో లేదో ఎలా చెక్ చేయాలి?
కంపెనీ ప్రతి వాహనానికి ఒక ప్రత్యేకమైన వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తుంది. మీ బైక్ ఈ ఉచిత అప్‌గ్రేడ్ కిందకు వస్తుందో లేదో తెలుసుకోవడానికి రెండు సులువైన మార్గాలు ఉన్నాయి. మీ ఫోన్‌లోని RE యాప్‌లోకి లాగిన్ అయి, మై వెహికల్ సెక్షన్‌లోకి వెళ్తే కంపెనీ నుంచి నోటిఫికేషన్ లేదా కంపొనెంట్ అవైలబిలిటీ అలర్ట్ కనిపిస్తుంది. మీ సమీపంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆథరైజ్జ్ సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేసి లేదా నేరుగా మీ బైక్ ఛాసీ నెంబర్ లేదా వీఐఎన్ నెంబర్ చెబితే వాళ్లు సిస్టమ్‌లో వెరిఫై చేసి పార్ట్ స్టాక్ అందుబాటును బట్టి ఇన్‌స్టలేషన్ స్లాట్ కేటాయిస్తారు.
రైడర్‌కు గేర్ పొజిషన్ అవసరం ఎంత?
కొందరు సీనియర్ రైడ్లు ఇంజిన్ శబ్దాన్ని బట్టి గేర్ మార్చడం అలవాటు చేసుకున్నప్పటికీ సాధారణ రోజువారీ వినియోగదారులకు, కొత్తగా బైక్ నేర్చుకున్న బిగినర్స్‌కి గేర్ ఇండికేటర్ అత్యంత ఉపోయగకరమైన ఫీచర్. పదే పదే గేర్లు మార్చాల్సి వచ్చినప్పుడు నగర ట్రాఫిక్‌లో బైక్ ఏ గేర్‌లో ఉందో మీటర్‌పై స్పష్టంగా కనిపించడం వల్ల హాఫ్ క్లచ్ వాడకం తగ్గుతుంది. సరైన వేగానికి తగ్గట్టు సరైన గేర్‌లో ప్రయాణించం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. కొత్త జే సిరీస్ ఇంజిన్ స్మూత్ గేర్ షిప్టింగ్‌ను అందిస్తాయి. గేర్ నెంబర్ పర్ఫెక్ట్‌గా తెలియడం వల్ల గేర్ బాక్స్ వేర్ అండ్ టియర్ సేఫ్‌గా ఉంటుంది.
మీ బైక్ ఆగస్టు 2025లో డెలివరీ అయ్యి ఉంటే సర్వీసింగ్ టైమ్ వరకు ఆగకుండా వెంటనే సమీపంలోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంట్‌కు సంప్రదించండి.
