Benefits Of Walk After Dinner: రాత్రి వేళలో చాలా మంది తిన్న వెంటనే బెడ్‌ ఎక్కేస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్ తీసుకొని నచ్చిన వెబ్‌సిరీస్‌, సోషల్ మీడియా, రీల్స్‌ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. కాసేపు అలా కాలక్షేమం చేసిన తర్వాత కనుకు తీస్తున్నారు. ఇప్పుడు చాలా మంది డైలీ రొటీన్‌గా మారింది. అయితే అలాంటి వారంతా తమ అనారోగ్యాన్ని తామే ఆహ్వానిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో మెదడుగా పిలిచే గట్‌కు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి లైఫ్‌ స్టైల్ కారణంగానే ప్రతి ముగ్గురిలో ఒకరు నేడు గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్నారు. 

Continues below advertisement

ఈ గట్‌ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన, అత్యంత సులభమైన లైఫ్‌ హాక్‌ ఒకటి ఉంది. దీని కోసం మీరు రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదు. భారీ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. రాత్రి భోజనం ముగించిన తర్వాత పది నుంచి 15 నిమిషాలు నడిస్తే చాలు మీ గట్ హెల్త్‌ ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఇంట్లోనో లేదా బయట ప్రశాంతంగా నడిస్తే చాలు. వైద్య పరిభాషలో దీనినే పోస్ట్‌ ప్రాండియల్‌ వాకింగ్‌ అంటారు. రాత్రి తిన్న తర్వాత మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

డిన్నర్ తర్వాత ఎందుకు మంచిది?

మనం ఆహారం తిన్న తర్వాత అది జిర్ణాశయం నుంచి చిన్న పేగులోకి వెళ్లే ప్రక్రియను వైద్య భాషలో గ్యాస్ట్రిక్ ఎంప్టియిగ్ అంటారు. మీరు తిన్న వెంటనే కూర్చున్నా, పడుకున్నా సరే ఈ ప్రక్రియ సజావుగా సాగదు. అందుకే మీరు తిన్న ఆహారం ప్రాథమిక దశలోనే ఉండిపోతుంది. దీంతో ఫుడ్ పులిసిపోతుంది. దీని కారణంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. 

Continues below advertisement

భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థలోని కండరాలు చాలా యాక్టివ్ అవుతాయి. దీంతో జీర్ణనాళం కదలికలు వేగంగా జరుగుతాయి. ఫలితంగా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మీరు నడిచేది పది నిమిషాలే అయినా అది 30 శాతం పనిని పూర్తి చేస్తుంది. 

బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌ 

మీరు భోజనం చేసిన తర్వాత కార్బోహైడ్రేట్‌లు గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. దీంతో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. దీన్ని నియంత్రించడానికి ప్యాంక్రియాస్‌ గ్రంథి భారీగా ఇన్సులిన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల దాని పని తీరు మందగిస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. 

అయితే మీరు నడవడంతో ప్యాంక్రియాస్ గ్రంథిపై భారం పడకుండా ఉంటుంది. మీరు తిన్న కార్బోహైడ్రేట్‌లోని గ్రూకోజ్‌ను కండరాలు తీసుకుంటాయి. వాటిని శక్తిగా మార్చుకుంటాయి. ఇది మీరు తిన్న తర్వాత నడిచినప్పుడు జరుగుతుంది. 

స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో రాసినట్టుగా మీరు భోజనం తర్వాత ఐదు నిమిషాల పాటు నడిచినా చక్కెర స్థాయి భారీగా తగ్గుతుందని  తేలింది. అలాంటిది పది నుంచి 15 నిమిషాల పాటు నడిస్తే 22 శాతం వరకు గ్లూకోజ్ లెవల్స్‌ నియంత్రించవచ్చని చెబుతున్నారు. 

అసిడిటీ, బ్లోటింగ్‌, గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్‌‌కు చెక్ 

తిన్న తర్వాత చాతీలో మంటగా ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. లేదా పుల్లటి తేన్పులు వస్తున్నాయని చెబుతుంటారు. దీనినే యాసిడ్ రిఫ్లక్స్‌అంటారు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్రావిటీ లేకపోవడంతో జీర్ణాశయంలోని హైడ్రోక్లీరిక్ యాసిడ్ సులభంగా అన్నవాహిక ప్రవేశిస్తుంది. దీని వల్ల లోపలి పొరలు దెబ్బ తిని మంట పుట్టిస్తుంది. అందుకే రాత్రి వేళలో భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల యాసిడ్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. అంతే కాకుండా మీ లాలాజలం కిందికి వేళ్తుంది. దీంతో అన్నవాహికలోకి యాసిడ్స్ వచ్చినా వాటిని కూల్ చేస్తుంది. దీంతో ఎలాంటి మందుల అవసరం లేకుండానే కడుపు ఉబ్బరం, అసిడిటీ తగ్గుతుంది. 

నడక వల్ల గుడ్ బ్యాక్టీరియా

మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసికంగా బలంగా ఉండాలన్నా సరే గట్‌ హెల్త్ అనేది చాలా అవసరం. గట్‌ మైక్రోబయోమ్‌లో ఉండే మంచి బ్యాక్టీరియాలు మీకు మంచి చేస్తుంటాయి. మీరు రోజూ రాత్రి పూట భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. లేకుంటే దీని శాతం తగ్గిపోయి మీరు అనారోగ్యం పాలవుతారు. 

రాత్రి వేళల్లో జీవక్రియ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందులో మీరు ఫుల్‌గా భోజనం చేసిన తర్వాత పడుకుంటే అది మరింత మందగిస్తుంది. దీంతో క్యాలరీలన్నీ కొవ్వుగా మారిపోతాయి. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. మీరు రాత్రి తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల మెటబాలిజం రీబూట్ అవుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చు చేయడానికి సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. 

రాత్రి భోజనం తర్వాత ఎంత సమయం నడవాలి?

చాలా మంది తిన్న తర్వాత త్వరగా అరిగిపోవాలనో లేకా ఇంకా మరింత ఆరోగ్యం కోసం పరుగులు తీస్తుంటారు. లేదా వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. మీరు ఆహారం తీసుకున్న తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా మీరు తీసుకున్న ఫుడ్‌ను జీర్ణం చేసే పనిలో ఉంటుంది. కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ మీరు పరుగులు తీస్తే జీర్ణం చేసే ప్రక్రియను పక్కన పెట్టి మీకు పరుగెత్తే శక్తిని ఇచ్చే విషయంపై దృష్టి పెడతాయి. దీంతో జీర్ణక్రియ ఆగిపోతుంది. దీని వల్ల కడుపులో నొప్పి వస్తుంది. కొన్నిసార్లు వాంతులు అవుతాయి. 

అందుకే భోజనం చేసిన తర్వాత పది నుంచి ఇరవై నిమిషాలు నడిస్తే చాలు. దీనిని డైలీ మార్నింగ్ చేసే వాకింగ్‌లా కాకుండా, రిలాక్స్‌గా, పచార్లు చేసేలా నడిస్తే చాలు. భోజనం చేసిన ఐదు నుంచి 10 నిమిషాలు నడవడం మంచిది. 

రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం మీ గట్‌ హెల్త్‌కు మంచిది . అయితే పరుగెట్టడం,హెవీ వెయిట్స్‌ ఎత్తం, బ్రిస్క్ వాకింగ్ చేయడం మంచిది కాదు.