Rolls Royce Fancy Number Plate: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చాలా మంది బిలియనీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారిలో కొందరు తమ లగ్జరీ లైఫ్‌స్టైల్‌న, ఖరీదైన కార్లను ప్రదర్శిస్తూనే ఉంటారు. వారిలో భారతీయ బిలియనీర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి దుబాయ్‌లో తనకు ఇష్టమైన నంబర్ ప్లేట్‌ను పొందినందుకు వార్తల్లో ఉన్నాడు. దీని కోసం అతను ఏకంగా రూ.76 కోట్లు చెల్లించాడు. ఈ భారతీయ బిలియనీర్ వద్ద ఏకంగా ఐదు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి.
వాస్తవానికి మో వ్లాగ్స్ ఛానెల్ ద్వారా యూట్యూబ్‌లో ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో ఆ వ్యక్తి పేరు అబూ సబా అని తెలిపారు. అలాగే అతని అసలు పేరు బల్విందర్ సాహ్ని అని కూడా వెల్లడించారు. ఇతని రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII D5 అనే నంబర్ ప్లేట్‌ను కలిగి ఉంది. దీనిని అతను తొమ్మిది మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.76 కోట్లు అన్నమాట.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కార్లపై ఉండే ప్రత్యేక నంబర్ ప్లేట్లు ఇవేబల్వీందర్ సాహ్ని వద్ద డీ5 మాత్రమే కాకుండా ఇతర ప్రత్యేక నంబర్ ప్లేట్‌లు కూడా ఉన్నాయి. అతని కొన్ని ప్రత్యేక నంబర్ ప్లేట్‌లలో 1, 27, 49 నంబర్లు కూడా ఉన్నాయి. ప్రత్యేక నంబర్ ప్లేట్ 1 గురించి చెప్పాలంటే అది మెర్సిడెస్ బెంజ్ జీ63 కారుకు ఉంది. అబు సబా అకా బల్విందర్ సాహ్ని... వ్లాగర్‌కి టూర్ ఇస్తూ తనకు గోల్డెన్, లేత గోధుమరంగు రంగులు చాలా ఇష్టమని చెప్పాడు. ఇది మాత్రమే కాదు సాహ్ని దగ్గర బుగాటి చిరోన్ కూడా ఉంది.
రోల్స్ రాయిస్‌కు సంబంధించిన నాలుగు మోడళ్లు భారతదేశంలో అమ్ముడు పోతున్నాయి. వీటిలో అత్యంత చవకైన కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. ఈ లగ్జరీ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6.95 కోట్ల నుంచి మొదలై రూ.7.95 కోట్ల వరకు ఉంటుంది. ఈ నాలుగు కార్ల గురించి మాట్లాడినట్లయితే వాటిలో రోల్స్ రాయిస్ కల్లినాన్, ఘోస్ట్, ఫాంటమ్, స్పెక్టర్ వంటి కార్ల పేర్లు ఉన్నాయి. భారతదేశంలో బాలీవుడ్ ప్రముఖుల నుంచి అంబానీ కుటుంబం వరకు చాలా మంది రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నారు. టాలీవుడ్‌లో కూడా ప్రభాస్, చిరంజీవి వంటి టాప్ స్టార్లు రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగిస్తున్నారు.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?