Renault Motor India: నిస్సాన్, రెనో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నాలుగు కొత్త కార్లను రూపొందిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో రెండు ఐదు సీట్ల SUVలు (రెండు బ్రాండ్‌ల నుంచి ఒక్కొక్కటి), వాటికే సంబంధించిన 7 సీటర్ వేరియంట్లు ఉన్నాయి.


రెనో డస్టర్, నిస్సాన్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్, డిజైన్
రాబోయే రెండు మధ్యతరహా ఎస్‌యూవీల టీజర్‌ను కాన్సెప్ట్ రూపంలో విడుదల చేశారు. ఎస్‌యూవీలు రెనో నిస్సాన్ (Renault Nissan) ఉమ్మడి కూటమి మాడ్యులర్, అగ్రెసివ్‌గా లోకలైజ్ చేసిన సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఇదే ప్లాట్‌ఫారంను రెనో సిస్టర్ బ్రాండ్ డాసియా, అలాగే రెండు తయారీదారుల నుంచి వచ్చే అనేక గ్లోబల్ మోడల్‌ల్లో కూడా ఉపయోగిస్తారు.


రెనో (Renault) అఫీషియల్‌గా తెలపనప్పటికీ దాని సీఎంఎఫ్-బీ ఆధారిత 5 సీటర్ ఎస్‌యూవీ 'డస్టర్' (Renault Duster) నేమ్‌ప్లేట్‌తో తిరిగి మార్కెట్లోకి రావచ్చని వార్తలు వస్తున్నాయి. కొత్త తరం రెనో డస్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించింది.


అయితే ఇటీవల టీజ్ చేసిన సీఎంఎఫ్-బీ ఎస్‌యూవీ గ్లోబల్ స్పెక్ డస్టర్‌తో పోలిస్తే కొన్ని స్టైలింగ్ మార్పులతో రానుంది. ఇందులో రీడిజైన్ చేసినన హెడ్‌ల్యాంప్‌లు, అలాగే కొత్త ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. నిస్సాన్ ఎస్‌యూవీ ఎల్-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను కలిగి ఉంటుంది. ఇవి ముక్కుకు అడ్డంగా నడుస్తున్న లైట్ బార్‌తో కలిసి ఉంటాయి.


రెనో డస్టర్, నిస్సాన్ ఎస్‌యూవీ 7 సీటర్ కూడా...
ప్రస్తుతం హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700లను మూడు వరుసల కార్ల మార్కెట్లో ముందంజలో ఉన్నాయి. ఈ విభాగంలో పెరుగుతున్న అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని రెండు ఎస్‌యూవీలు కూడా వాటి 7 సీటర్ వేరియంట్‌లను కూడా మార్కెట్లోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. రెండు ఎస్‌యూవీల మూడు వరుసల వెర్షన్‌లు కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్‌లను, పొడవైన వీల్‌బేస్‌ను పొందే అవకాశం ఉంది.


రెనో డస్టర్, నిస్సాన్ ఎస్‌యూవీ... లాంచ్ ఎప్పుడు?
కొత్త రెనో డస్టర్ 2025 (2025 Renault Duster) ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నాలుగు ఎస్‌యూవీల్లో దేనికీ అధికారిక లాంచ్ తేదీ విడుదల కాలేదు. రెనో డస్టర్, నిస్సాన్ 5 సీటర్ ఎస్‌యూవీలు ముందుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటి 7 సీటర్ వేరియంట్‌లు వస్తాయి. రెండు బ్రాండ్‌ల ఉత్పత్తులను దాదాపు ఒకేసారి విడుదల చేయనున్నట్లు కంపెనీలు ధృవీకరించాయి. అదనంగా ఇంకా ఎటువంటి వివరాలు తెలపనప్పటికీ మరో రెండు ఉత్పత్తులను కూడా ప్రారంభించే ప్లాన్లు ఉన్నాయి.


లాంచ్ అయిన తర్వాత ఈ రెండు ఎస్‌యూవీలు... హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, ఎంజీ ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీపడతాయి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!