Renault 5 Electric Hatchback: రెనో తన ‘5’ హ్యాచ్‌బ్యాక్‌ను గ్లోబల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకురానుంది. ఈ కారు కొన్ని రోజుల్లో లాంచ్ కానుంది. కొత్త రెనో 5 పూర్తిగా ఎలక్ట్రిక్ కారు, మినీ కూపర్ వంటి కార్లకు పోటీగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఎక్స్‌టర్నల్ ఛార్జ్ ఇండికేటర్ బోనెట్‌పై ఉంది. వెనుకవైపు స్టైలింగ్ జనాదరణ పొందిన వింటేజ్ రెనో 5ని పోలి ఉంటుంది. ఇది 70వ దశకంలో ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి.
కొంతకాలం క్రితం రివీల్ అయిన రెనో 5 కాన్సెప్ట్‌తో పోలిస్తే ప్రొడక్షన్ స్పెక్ రెనో 5 డిజైన్ అలాగే ఉంచారు. కాన్సెప్ట్ కంటే తక్కువ డిటైల్స్‌తో 3 డోర్ హ్యాచ్‌బ్యాక్‌గా ఇది వచ్చే అవకాశం ఉ:ది. ఛార్జింగ్ పోర్ట్ వీల్ ఆర్క్ వైపు ఉంది.
బ్యాటరీ, ఇంటీరియర్ ఇలా?
కొత్త రెనో 5లో 52 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 3.9 మీటర్ల పొడవుతో దాదాపు కొత్త మినీ కూపర్‌కు సమానమైన పరిమాణంలో ఉంది. దీని ఇంటీరియర్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, గూగుల్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అయితే ఫాబ్రిక్ ఇంటీరియర్ పాత ఆర్5 మాదిరిగానే ఉంటుంది. రెనో 5 ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అటువంటి కార్లు ఎక్కువ జనాదరణ పొందిన గ్లోబల్ మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. రెనో 5 భారతీయ మార్కెట్‌కు చాలా ఖరీదైనది అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ అవతార్‌లో పాత కార్లను తిరిగి తీసుకురావడం తాజా ట్రెండ్ అని చెప్పవచ్చు.
త్వరలో చాలా కార్లు...
భారతదేశం కోసం రెనో కొత్త లైనప్ కార్లను సిద్ధం చేస్తోంది. ఇందులో వచ్చే ఏడాది రానున్న కొత్త ఎస్‌యూవీ, డస్టర్, దాని 7 సీటర్ వేరియంట్, అలాగే మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ దేశంలో ట్రైబర్, కిగర్, క్విడ్‌లను కంపెనీ విక్రయిస్తోంది.