Rashtrapati Bhavan Buys Tata Tiago EV And Tata Curvv Dark Edition: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్‌లు, బైక్‌లు, బస్సులు, ఆటోల వంటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. దేశంలోనే అత్యున్నత అధికార కేంద్రమైన రాష్ట్రపతి భవన్ కూడా ఈ చొరవలో భాగమైంది. సుప్రసిద్ధ కార్ కంపెనీ టాటా మోటార్స్, తన రెండు పాపులర్ ఎలక్ట్రిక్ మోడళ్లు కర్వ్ EV & టియాగో EV లను న్యూదిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు డెలివరీ చేసింది. ఇది, ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడంతో పాటు 'మేక్ ఇన్ ఇండియా' చొరవను కూడా బలోపేతం చేస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ఈ రెండు కార్లనే ఎందుకు డెలివెరీ చేశారు, వాటి ప్రత్యేకత ఏంటి, ధర ఎంతో తెలుసుకుందాం.
టాటా EV వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రెండు కార్లలో (Tata Tiago EV & Tata Curvv EV) 50 శాతానికి పైగా 'మేక్ ఇన్ ఇండియా' స్పేర్ పార్టులు & టెక్నాలజీని ఉపయోగించారు. కాబట్టి, ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ప్రకారం, ఈ కంపెనీ క్లాస్ 1 సప్లయర్ కేటగిరీ కిందకు వస్తుంది.
టాటా కర్వ్ ఈవీ డార్క్ ఎడిషన్ ధర, రేంజ్‌టాటా కర్వ్ EV డార్క్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Curvv Dark Edition ex-showroom price) రూ. 22.24 లక్షలు. 55 kWh బ్యాటరీ కెపాసిటీతో ప్యాక్ చేసిన కర్వ్ EV టాప్-స్పెక్ వేరియంట్ ఎంపవర్డ్+ A ట్రిమ్ ఆధారంగా ఈ కార్‌ను తీర్చిదిద్దారు. ఈ టాటా కారు రేటు దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25,000 ఎక్కువ. టాటా కర్వ్ EV 'ఫ్రంట్ వీల్ డ్రైవ్' (FWD) మోటారుతో పరుగులు పెడుతుంది. ఇది గరిష్టంగా 167 hp పవర్‌ను & 215 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 55 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న కర్వ్ ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 502 km రేంజ్ (Tata Curvv EV Range) వరకు ఇస్తుందని కంపెనీ తెలిపింది.
టాటా టియాగో ఈవీ ధర, రేంజ్‌టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర (Tata Tiago EV ex-showroom price) రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.49 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్‌ను పూర్తి ఛార్జ్ చేస్తే 250 km వరకు డ్రైవ్ రేంజ్ (Tata Tiago EV Range) అందిస్తుంది. టాప్ వేరియంట్‌లో ఈ పరిధి 315 km వరకు ఉంటుంది. టియాగో EV టాప్ వేరియంట్‌లో 24kWh బ్యాటరీ కెపాసిటీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, టాటా టియాగో ఈవీ ఆన్-రోడ్ ధర (Tata Tiago EV on-road price) రూ. 8.45 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.83 లక్షల వరకు ఉంటుంది. దీనిలో.. ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ రూ. 1,650; ఇన్సూరెన్స్ రూ. 42,298; ఇతర ఛార్జీలు రూ. 2,100 వరకు కలిసి ఉన్నాయి.
టాటా టియాగో ఈవీ ధర సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది, దగ్గరి దూరాలకు తిరిగడానికి దీని రేంజ్ సరిగ్గా సరిపోతుంది. కాబట్టి, రాష్ట్రపతి భవన్ కోసం కొన్న కార్‌ను మీరు కూడా కొనండి, దర్జాగా తిరగండి.